May half of the cabinet fill by bjp in jammu kashmir

jammukashmir, pdp, bjp, cabinet, mufti, modi, newgovt,

may half of the cabinet fill by bjp in jammu kashmir. mufti mohmad will oath on sunday with his 24 ministers cabinet. in the mufti cabinet may half of them from bjp party. bjp and pdp alliance together to form govt in jammu kashmir

ముఫ్తీ క్యాబినెట్ లో సగం మంది భాజపా మంత్రులు

Posted: 02/28/2015 09:18 AM IST
May half of the cabinet fill by bjp in jammu kashmir

జమ్ము కాశ్మీర్ లో కొత్త గా కొలువుదీరే  కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రి సహా 12 మంది బీజేపీ సభ్యులు ఉంటారు. ఆ పార్టీ నేత నిర్మల్ సింగ్‌కు డిప్యూటీ పోస్టు దక్కే అవకాశముంది. తమ ఉమ్మడి ప్రభుత్వం చేపట్టే కనీస ఉమ్మడి కార్యక్రమం వివరాలను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని  ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అన్నారు. ఎన్నికల ఫలితాలను బట్టి కశ్మీర్ ప్రజలు పీడీపీకి, జమ్మూ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, అందుకే రెండు పార్టీలు కలసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే మొత్తం 24 మందితో కొత్త కేబినెట్ ఉండబోతోందని సమాచారం.
 
 కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉన్నందున రాష్ర్టంలో వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోకూడదనే పీడీపీ భావించిందని, ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అన్న మోదీ నినాదానికి తానూ మద్దతిస్తున్నానన్నారు. రాష్ర్టంలో రాజకీయంగా, పాలనాపరంగా బీజేపీతో కసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అమలుపరుస్తామన్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోదీతో కలసి పనిచేస్తానని పేర్కొన్నారు. పాకిస్తాన్ విషయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి అనుసరించిన విధానాన్నే పాటిస్తామని, అందుకు మోదీ అంగీకరించారన్నారు.  
 
 కశ్మీర్‌ను శాంతి ద్వీపంగా మార్చాలని మోదీ భావిస్తున్నారని, తాము కూడా అదే ఆశిస్తున్నాయని ముఫ్తి తెలిపారు. తొమ్మిదేళ్ల తర్వాత సయీద్ మళ్లీ సీఎం అవుతుండగా, కశ్మీర్‌లో బీజేపీ తొలిసారిగా అధికారం చేపడుతుండటం విశేషం.  బీజేపీతో పీడీపీ జట్టుకట్టడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కూటమి పట్ల రాష్ర్ట ప్రజలేమీ హర్షించడం లేదన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammukashmir  pdp  bjp  cabinet  mufti  modi  newgovt  

Other Articles