Ts govt complete arrangments for yadagirigutta celebrations

yadagirigutta, kcr, telangana, narasimhan, thirupathi, endoment department

telangana govt complete arrangments for yadagirigutta celebrations. from this year govt officially doing arrangmets of celebrations at yadagirigutta. cm kcr, governor narasimhan and many more ministers have to participate in the celebrations.

ఈ రోజే యాదగిరీశుడి కళ్యాణమహోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

Posted: 02/27/2015 09:06 AM IST
Ts govt complete arrangments for yadagirigutta celebrations

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం అర్ధరాత్రి యాదగిరికొండపై కన్నుల పండువగా జరగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉదయం   సేవలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, మంత్రులు జగదీశ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దంపతులు రాత్రి జరిగే కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. యాదగిరిగుట్టను మరో తిరుపతిగా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో కృషిచేస్తున్న తరుణంలో జరుగుతున్న ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.

కల్యాణ నరహరిని కన్నులారా చూసి మురిసిపోవాలని.. ఇలాంటి ఉద్విగ్న క్షణాలను యాదగిరిలో గడపాలని భక్తులు యాదగిరి బాటపట్టారు. కల్యాణతంతు కమణీయంగా నిర్వహించేందుకు యాదగిరిగుట్ట అర్చకులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆలయ ఈవో, డిప్యూటీ కలెక్టర్ గీత సూచనల మేరకు యాదగిరికొండపైన వ్యాపారుల సంఘం కల్యాణ మండపానికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేయనున్నారు. ఒకవైపు బాజాబజంత్రీలు, మరోవైపు భేరీ నినాదాలు, భక్తుల జయజయ ద్వానాలు, మిరిమిట్లు గొలిపే పటాకుల మధ్య యాదగిరీశుడి కల్యాణోత్సవం జరగనుంది. స్వామివారి కల్యాణం భక్తులకు కన్పించేందుకు పెద్ద స్ర్కీన్ లను ఏర్పాట్లు చేశారు. రాత్రి 10 గంటలకు కల్యాణ సేవ, 10.15 నుంచి కల్యాణతంతు మొదలవుతుంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yadagirigutta  kcr  telangana  narasimhan  thirupathi  endoment department  

Other Articles