Kcr order to officers to buy elctricity at any cost

kcr, electricity, powercut, agriculture, industrys, electricityboard, telanagana

kcr order to officers to buy elctricity at any cost. telagana cm kcr review the power supply in the state. ha order to buy 4 to 5 million units.

ఎంత ఖర్చైనా విద్యుత్ కొనండి: కెసిఆర్

Posted: 02/27/2015 09:02 AM IST
Kcr order to officers to buy elctricity at any cost

వేసవిలో వ్యవసాయం, పరిశ్రమలకు కోతలు లేకుండా చూసేందుకు అదనపు విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ కొనుగోలుకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతపై అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. ప్రస్తుతం రోజుకు 800 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటున్నదని, దీనిని పూడ్చుకునేందుకు పవర్ ఎక్సేంజినుంచి 4నుంచి 5 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సీఎం స్పందిస్తూ కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలన్నీ పరిశీలించండి. కానీ వ్యవసాయం, పరిశ్రమల రంగాలపై మాత్రం విద్యుత్ కొరత ప్రభావం ఉండకూడదు అని స్పష్టం చేశారు.

కేరళలోని కాయంకుళంనుంచి, ఈస్టర్న్ పవర్ గ్రిడ్‌నుంచి విద్యుత్‌ను తీసుకొచ్చుకునేందుకు ఉన్న అవకాశాలపై ఆలోచించాలని సిఎం కెసిఆర్ సలహా ఇచ్చారు.  వ్యవసాయం, పరిశ్రమల రంగాలకు విద్యుత్ సమస్యలు రాకుండా చూసుకోవాలని అన్నారు. నల్గొండ జిల్లా దామరచెర్లలో ఏర్పాటుచేస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. సౌరవిద్యుత్‌పైకూడా దృష్టి కేంద్రీకరిచాలని అన్నారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు తగిన పరిస్థితులను, మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చూపుతున్న చొరవ, స్పల్పకాల, దీర్ఘకాల ప్రణాళికల అమలువల్ల వ్యవసాయం, పరిశ్రమల రంగాలపై విద్యుత్ కోత ప్రభావం ఉండబోదని విద్యుత్‌శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  electricity  powercut  agriculture  industrys  electricityboard  telanagana  

Other Articles