Central govt clear that not ready to quit 370 article

jammu kashmir, 370 article, constitution, nda, modi, pdp, mufti mohmad,

central govt clear that not ready to quit 370 article. pm modi announce that after elections the nda govt will discuss about the posibility to remove 370 article. pdp pressure to quit the article.

370 ఆర్టికల్ తొలగింపు కుదరదు.. తేల్చిన కేంద్ర ప్రభుత్వం

Posted: 02/26/2015 03:38 PM IST
Central govt clear that not ready to quit 370 article

కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాగంలోని 370 అధికరణను తొలగించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక రాజ్యాంగ అధికరణను తొలగించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలోనే లేదని హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి తెలిపారు. భారత యూనియన్‌లో జమ్ముకాశ్మీర్ కొనసాగడానికి వీలు కల్పించేందుకే రాజ్యాంగంలో 370 అధికరణను పొందు పరిచారని ఆయన వివరించారు. ఈ అధికరణ ప్రాతిపదికగానే భారత యూనియన్‌తో కాశ్మీర్ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. దీని ప్రకారం కాశ్మీర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కొన్ని చట్టాలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి-పిడిపిలు సమాయత్తమవుతున్న నేపధ్యంలో 370 అధికరణపై సందేహాలను తొలగిస్తూ కేంద్రం ప్రకటన చేయడం గమనార్హం.

అయితే కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తు, రాజ్యాంగంలోని ఈ అధికరణను తొలగించే విషయమై తాము ఆలోచిస్తున్నామని, అన్ని రాష్ట్రాల మదిరిగా జమ్ము కాశ్మీర్ కూడా అభివృద్ది చెందాలని ఎన్నికల సమయంలో మోదీ తెలిపారు. కాగా ఇప్పుడు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం 370 ఆర్టికల్ పై దాటవేత ధోరి అవలంబిస్తోంది. నిజానికి 370 ఆర్టికల్ అక్కడి పౌరులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్న మాట వాస్తవమే అయినా జమ్ము కాశ్మీర్ ను భారత భూభాగానికి కలుపుతూ ఈ ఆర్టికల్ కీలకంగా మారింది. భారతదేశానికి భారతరాజ్యాంగం అమలులో ఉంటే, ఒక్క జమ్ము కాశ్మీర్ లో మాత్రం 1935 భారత రాజ్యాంగ చట్టం అందుబాటులో ఉంటుంది. అంటే భారత్ మొత్తం ఒకరకమైన నియమాలను పాటిస్తుంటే, జమ్ము కాశ్మీర్ లో మాత్రం ప్రత్యేక నియమావళి ఉంది. భారత్ మొత్తంలో మహిళలకు ఆస్తి హక్కును తొలిగిస్తే, జమ్ము కాశ్మీర్ లో మాత్రం ఈ హక్కు అందుబాటులో ఉంది. ఇలా జమ్ము కాశ్మీర్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆర్టికల్ 370 ని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తు, 370ఆర్టికల్ ను తొలగించేది లేదని తెలిపింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  370 article  constitution  nda  modi  pdp  mufti mohmad  

Other Articles