Govt plans to cashless pds system

rupee card, pds, public distribution system, ration, banks, jandhanm devit cards

govt planning to distribute the public ditribution systems items without cash while useing rupee card. in the jandhan programme the banks issue rupee cards to the account holders. newly govt plans to attach pds to rupee cards.

రూపే కార్డు ఉండగా డబ్బు దండగ.. నగదురహితంగా పిడియస్ వ్యవస్థ

Posted: 02/26/2015 08:28 AM IST
Govt plans to cashless pds system

డీలర్ దుకాణాల ద్వారా జరుగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో మార్పులు రానున్నాయి. డబ్బులు లేకుండానే ఆహార భద్రతకార్డుదారులు, రూపే కార్డులు తీసుకుని వెళ్లి తమ కోటా కింద వచ్చే  సరుకులను రేషన్‌ షాపు నుంచి పొందవచ్చు. భవిష్యత్తులో రేషన్‌ సరఫరాల్లో అవకతవకలు, తూకాల్లో మోసాలు ఉండవు. రేషన్‌ షాపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రంలో మీ రూపే కార్డును స్వైప్‌ చేయగానే మీకు రావాల్సిన కోటా ఎలక్ట్రిక్ వేయింగ్ మెషీన్ ద్వారా మీ చేతికి అందుతుంది. ఈ విధానం త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే చౌక ధరల దుకాణాల్లో నగదు రహితంగా రూపే కార్డుద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జనధన్‌ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ రూపే కార్డులను అందజేసిన విషయం తెలిసిందే. ఇక మీదట ఈ కార్డుల ద్వారానే పేదలకు రేషన్‌ అందించే విధానాన్ని అమలు చేసేందుకు రంగారెడ్డిజిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

రేషన్‌ షాపులన్నింటిలో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా యంత్రాలు ఇప్పటికే హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అయితే సాధారణ డెబిట్‌ కార్డుల ద్వారా డబ్బు చెల్లించే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసే విధానంలో రూపే కార్డు ద్వారానే సరుకులు కొనుగోలు చేయాలి. అలాగే పీఓస్‌ మెషిన్‌ ఇపుడున్న దాని కంటే భిన్నంగా ఉంటుంది. డెబిట్‌కార్డు స్వైపింగ్‌తో పాటు లబ్ధిదారులను గుర్తించే విధంగా పీఓస్‌ మెషిన్‌ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందాలి. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించేందుకు ఐరీస్‌ కనుపాపలు లేదా వేలిముద్రలు.. ఏవి సేకరించాలి? అనే దానిపై కేంద్రం కూడా కసరత్తు చేస్తోంది. దీనిపై కేబినెట్‌ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఇదే విధానాన్ని రేషన్‌ పక్రియలో కూడా అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్‌ సరఫరాలో అక్రమాలకు కళ్లెం పడడంతో పాటు ప్రభుత్వానికి నెలకు నిత్యావసర సరుకల్లో 10 నుంచి 15 శాతం మిగులు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి గనదు రహిత ప్రజా పంపిణి వ్యవస్థ తొందరలోనే అందుబాటులోకి రానుంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rupee card  pds  public distribution system  ration  banks  jandhanm devit cards  

Other Articles