Telanagana clp leader janareddy told that he is the moon

telanagan clp, tcongress, tpcc, janareddy, pollala, congress, assembly, babu, kcr

telanagana congress clp leader janareddy fire on ponnala. he said to media that he is the moon, he didnt express heat. some congress leaders tolk anything and media will ask to answer those questions.

తెలంగాణలో మరో చంద్రుడు.. వెన్నెల మాత్రమే ఇస్తాడట

Posted: 02/26/2015 08:05 AM IST
Telanagana clp leader janareddy told that he is the moon

తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చంద్రలు ఉన్నారని అందరికి తెలుసు. ఏపి సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం చంద్రశేఖర్ రావ్. ఇలా వీరిద్దరే కాదు నేను కూడా చంద్రున్నే, నానుండి వెన్నెలే వస్తుందని అంటున్నారు మరోనేత. ఇప్పటికే ఇద్దరు చంద్రులు ఉన్నారు మరి ఇంకో కొత్త చంద్రుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతకీ ఎవరా చంద్రుడు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరో చదవాల్సిందే.

కాంగ్రెస్ నేత, తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి కొంత కాలంగా ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభలో మెతక వైఖరిని అవలంబిస్తున్నారని కాంగ్రెస్ అధిష్ఠానానికి కొందరు స్వంత పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు. అయితే తన వైఖరి ఇలానే ఉంటుందని తాను చంద్రుడిలాంటి వాడినని, తన నుండి వెన్నెల మాత్రమే వస్తుందని, వేడి రాదని మీడియా ఎదుట వెల్లడించారు.  మల్లెపువ్వు నుంచి సువాసన గుబాళించినట్టుగా మరోపవ్వు నుంచి రాదని, మరోపవ్వు వాసన ఇవ్వడం మల్లెపూవు వల్ల కూడా కాదన్నారు. తన పనితీరు మార్చుకోవాలని చెబుతున్నవారు, తనలా పనిచేయలేరని జానారెడ్డి వివరించారు.

తమ పార్టీలో వేడి పుట్టించే రంగయ్యలు ఉన్నారు. మీడియా వారు ఏది అడిగితే అది చెప్పడం ఆ రంగయ్యలకు సాధ్యం. నా గురించి ఎవరో రంగయ్య ఏదో అన్నాడని నాకు చెప్పడం, దానిపై నేనేదో మాట్లాడితే ఆ రంగయ్యలకు చెప్పడం, దానికి రంగయ్య ఏదో అనడం ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మీకు వార్తలు కావొచ్చు, కానీ అవన్నీ నాకు సాధ్యం కాదు. లేని వేడిని పుట్టించాలనుకుంటున్న మా పార్టీలో రంగయ్యను అడగండి అని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి  జానారెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి కాస్త చంద్రుడినంటూ స్వతహాగా ప్రకటించుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చం్ద్రులు ఉన్నా వేడి ఉందే కానీ వెన్నెల్ లేదని ఇప్పనటికే చాలా మంది అనుకుంటున్నారు. అయితే తాజా చంద్రున్ని ప్రజలు ఎలా స్వాగతిస్తారో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagan clp  tcongress  tpcc  janareddy  pollala  congress  assembly  babu  kcr  

Other Articles

Today on Telugu Wishesh