Suresh prabhu to unveil plans for raising resources in railway budget

railway budget 2015, Railway Minister Suresh Prabhu, suresh prabhu to table railway budget, Railway finances under terrible strain, Suresh Prabhu will hike the fares, budget initiatives besides enhancing safety and security, railway budget will hike freight charges,

With Railway finances under terrible strain, all eyes will be focused on whether Railway Minister Suresh Prabhu will hike the fares and freight rates in the Rail Budget Thursday which may contain proposals for 'Make in India' initiatives besides enhancing safety and security.

రైలు ప్రయాణికులపై బారం వేస్తారా..? లేక...

Posted: 02/25/2015 09:02 PM IST
Suresh prabhu to unveil plans for raising resources in railway budget

యావత్ భారతం అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దేశంలో మార్పును తీసుకువస్తాని ప్రజల మోదంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కార్ ప్రజలకు ఈ సారి పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది జూన్ లో అప్పటి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వడ్డింపులకే ప్రాధాన్యత ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఈ సారైనా.. ప్రజలపై భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంటుందా అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

గత ఏడాది వున్న రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ప్రస్తుతం పదవిలో లేరు. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రిగా వున్నది ప్రధానికి అత్యంత సన్నిహితుడైన సురేష్ ప్రభు.. అంతేకాదు పలు విప్లవాత్మకమైన మార్పులకు నాంధి పలికడానికి సమర్ధుడనే ప్రధాని ఈయనకు ఈ శాఖకు అప్పగించారు. తొలిసారిగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సురేష్ ప్రభు తన పెంపును కోనసాగిస్తూ నిర్ణయం తీసుకుంటారా.? లేక పెంపును ఉపసంహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటారా.? అన్నది వేచి చూడాల్సిందే. గత ఏడాది పార్లమెంటులో రైల్వే బడ్జెట్ కు ముందే ప్రయాణికులపై 14.2 శాతం, కార్గోపై 6 శాతం వడ్డింపులు వేసిన విషయాన్ని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. అందునా ఈ సారి కూడా తమపై భారం మోపుతారా..? లేక గతంలో మోపిన భారాన్ని దించుతారా అన్న ప్రజలు ఎదురుచూస్తున్నారు.

కాగా గతంలో ఇంధన ధరలు అధికంగా వున్న దరిమిలా చార్జీలను పెంచిన రైల్వే శాఖ ఈ సారి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో తగ్గిస్తుందన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ వార్తలు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనోహ్ శర్మ తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రైలు చార్జీలు తగ్గవని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి సురేష్ ప్రభు మరోమారు ప్రయాణికులపై భారం వేస్తారా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష 57 వేల 883 కోట్ల రూపాయలతో 676 ప్రాజెక్టులకు రైల్వే శాఖ అమోదించింది. కాగా వీటిలో కేవలం 317 ప్రాజెక్టులు మాత్రమే పూర్తి కాగా, 359 ప్రాజెక్టులు నిధులు లేక నిలిచిపోయాయి. 359 ప్రాజెక్టుల పనులను ప్రారంభించేందుకు రైల్వే శాఖ లక్ష 82 వేల కోట్ల రూపాయలను సమకూర్చకోవాల్సి వుంది.

* దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులు రైళ్లలో సరైన వసతులు లేవంటూ విమర్శలు చేస్తున్నారు.

* యూపీఏ పదేళ్ల కాలంలో రైళ్ల చార్జీలలో పెంపు లేకపోవడంతో నిధులు కొరత తెరపైకి వచ్చింది.

* రైల్వేలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించినా.. వాటిని తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం చెందింది.

* రైలు ప్రయాణికుల భద్రథకు పటిష్టమైన చర్యలు కూడా అవసరం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway budget 2015  Railway Minister  Suresh Prabhu  

Other Articles