Telecom tariffs set to go down as trai cuts interconnection charges

Telecom Tariffs Set to Go Down, Trai Cuts Interconnection Charges, Telecom regulatory authority of India, TRAI, call charges in India, telecom service providers, telecom companies, Interconnection usage charges, mobile termination charge, fixed termination, Flat rental plans,

TRAI, has reduced the network interconnection usage charges landline-to-landline or landline-to-mobiles, which was 20 paise.

సెల్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గనున్న చార్జీలు..

Posted: 02/24/2015 02:48 PM IST
Telecom tariffs set to go down as trai cuts interconnection charges

సెల్ పోన్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో సెల్ ఫోన్ చార్జీలు తగ్గనున్నాయి. ఇన్నాళ్లు సెల్ ఫోన్ నుంచి ల్యాండ్‌లైన్ ఫోన్లకు చేసే కాల్స్ పై విధించిన అదనపు భారం ఇక మీకు పడబోదు. ఎందుకంటే ఎట్టకేలకు ట్రాయ్ ఈ భారాన్ని తొలగించింది. ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి ఏ సర్వీస్‌నకు చెందిన ఇతర ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ ఫోన్‌కు.. అలాగే సెల్ ఫోన్ నుంచి ఏ సర్వీస్‌నకు చెందిన ఇతర ల్యాండ్‌లైన్ ఫోన్లకు చేసే కాల్స్‌కు వసూలు చేస్తున్న ఇంటర్‌కనెక్షన్ ఛార్జీలను టెలికాం నియంత్రణ, ప్రాధికార సంస్థ ట్రాయ్ రద్దు చేసింది.

దీంతోపాటు వేర్వేరు మొబైల్ నెట్‌వర్క్‌ల మధ్య కూడా ఈ ఛార్జీలను కాల్‌కు ప్రస్తుత 20 పైసల నుంచి 14 పైసలకు (30 శాతం మేర) తగ్గించింది. ఒక నెట్‌వర్క్ వినియోగదారుడు, మరో నెట్‌వర్క్ ఖాతాదారుకు కాల్ చేస్తే, అతని సర్వీసు ప్రొవైడరు కాల్ వెళ్లిన సర్వీస్ సంస్థకు చెల్లించేదే ఇంటర్‌కనెక్షన్ ఛార్జీ. వినియోగదార్లు చెల్లించే కాల్ రుసుములో ఇది కలిసి ఉంటుంది. ప్రస్తుతం ఇది కాల్‌కు 20 పైసలుగా ఉంది. ల్యాండ్‌లైన్‌కు పూర్తిగా రద్దు కాగా, మొబైల్ సంస్థల మధ్య 14 పైసలకు తగ్గించింది. ఈ నేపథ్యంలో టెలికాం టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉందని, దీంతో పాటు వైర్ లెస్ నుంచి ల్యాండ్ లైన్ ప్లాన్లలోనూ మార్పులు వస్తాయని ట్రాయ్ అశించింది. దీంతో ఇక దేశంలో ల్యాండ్ లైన్ కాల్స్ కు కూడా కాల్స్ పెరుగుతాయని అకాంక్షించింది. దేశంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు, వైర్‌లైన్ నెట్‌వర్క్‌లను మరింత బలోపేతం చేసేందు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Tariffs  Telecom  Trai  

Other Articles