Government within its rights to take the ordinance route

Ordinance , pm modi, arun jaitly, congress, govt, bjp, trinamul congress, mp, rajyasabha, rule, sessions, parliament

Finance Minister Arun Jaitley today fielded an opposition attack in Parliament on a slew of ordinances, or executive orders, passed by the government in the nine months that it has been in power. The most controversial of these ordinances seeks to bring major changes in the rules for land acquisition, which the Congress and other parties allege are against farmers' interests.

వేడెక్కిన రాజ్యసభ..ప్రభుత్వంపై దాడికి దిగిన విపక్షాలు

Posted: 02/24/2015 12:45 PM IST
Government within its rights to take the ordinance route

భూసేకరణ ఆర్డినెన్స్ పై రాజ్యసభ అట్టుడికింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, కేవలం కార్పోరేట్ వర్గాలకు లాభం చేకూరేలా ఆర్డినెన్స్ ఉందని విపక్షాలు ఆరోపించాయి. అన్నా హజారే నిరసన, రాహుల్ గాంధీ నిరసనల నేపథ్యంలో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది. అదీ కాకుండా కాంగ్రెస్ కు కేవలం రాజ్యసభలో మాత్రమే గట్టి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఈ సభలోనే తమ నిరసన గళాన్ని వినిపించాలని అనుకుంటోంది. కాంగ్రెస్ కు తృణముల్ కాంగ్రెస్ అండగా నిలిచింది. ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తు తృణముల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు నినాదాలు చేశారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, అందుకే అడ్డదారిలో ఆర్డినెన్స్ లను నమ్ముకుందని విపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం బైపాస్ లాంటి ఆర్డినెన్స్ లతో గట్టెక్కాలని చూస్తోందని విమర్శించాయి. ఆర్డినెన్స్ అనేవి పార్లమెంటుకు బైపాస్లాంటివి కాదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వీటి విషయంలో తాము ఏ తప్పు చేయడం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.  మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో భూసేకరణ అంశంతోపాటు పలు ఆర్డినెన్స్పై చర్చకు వచ్చాయి. "గతంలో ఉన్న ప్రభుత్వాలు 636 ఆర్డినెన్స్ లు తీసుకొచ్చి ఆమోదింపజేసుకున్నాయి. చట్టాలు చేశాయి. అందులో 80శాతం ఆర్డినెన్స్ లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అమలు చేశారని జైట్లీ ధ్వజమెత్తారు. తమది బైపాస్ రూట్ అని ఆరోపణలు చేయడం తప్పు''అని జైట్లీ విమర్శలను తిప్పికొట్టారు. ఆర్డినెన్స్పై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకీ లేదని చెప్పారు.

మరోవైపు ప్రధాని మోదీ సభలో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ అంతా సజావుగా ఉందని, ఎలాంటి మార్పులు అవసరం లేదని అన్నారు. విపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు. సంబందిత మంత్రులు, ఎంపీలు ఆర్డినెన్స్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ల్యాండ్ పూలింగ్ ఆర్డినెన్స్ పై వెనక్కి వెళ్లే ఆలోచన లేదని మోదీ స్పష్టం చేశారు. మొత్తానికి రెండవ రోజు పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ordinance  pm modi  arun jaitly  congress  govt  bjp  trinamul congress  mp  rajyasabha  rule  sessions  parliament  

Other Articles