Chris gayle slams fastest odi double century

Chris Gayle, Chris Gayle double century, Chris Gayle double hundred, West Indies v Zimbabwe, ICC Cricket World Cup 2015, Chris Gayle double century v Zimbabwe

Chris Gayle scored first ever fatest double century in a World Cup and also the first West Indies batsmen.

గేల్ డబుల్ సెంచరీ.. విలవిలలాడిన జింబాబ్వే..

Posted: 02/24/2015 12:50 PM IST
Chris gayle slams fastest odi double century

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ పరుగుల సునామీ సృష్టించాడు. ప్రపంచ కప్లో జంబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. అంతేకాదు వెస్టిండీస్ జట్టు తరపున వన్డేల్లో తొలి డబుల్ సెంచరీగా బ్యాట్స్మన్గా గేల్ రికార్డు సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లకు ముచ్చమటలు పట్టించి అల్ బాల్స్ లీడ్స్ టు బౌండరీస్ అన్నట్లుగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నిన్నటి వరకు చెత్త జట్టుకుగా వున్న విండీస్ కు గేల్ ఫామ్ లోకి రావడం వెయ్యేనుగులు బలాన్ని ఇచ్చింది.

138 బంతుల్లో 201 డబుల్ సెంచరీ సాధించాడు. గేల్ 9 ఫోర్లు, 16 సిక్సర్లతో ఈ ఫీట్ నెలకొల్పాడు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ 47  ఓవర్లలో వికెట్ నష్టానికి 325 పరుగులు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గేల్ సెంచరీ చేశాక.. ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో పెను విధ్వంసం సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా గేల్ ఘనత సాధించాడు. ఇంతకుముందు భారత ఆటగాళ్లు సెహ్వాగ్, సచిన్, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు చేయగా, ఆ జాబితాలోకి ఇప్పుడు గేల్ చేరాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chris Gayle  ICC Cricket World Cup 2015  

Other Articles