Rss chief kicks up row as he questions mother teresa s work

rss, mohanbhagath, mother theresa, service, kejriwal, sachin pilot, trinamol congress, religion, converting

RSS chief Mohan Bhagwat's comment that conversion to Christianity was the main objective behind Mother Teresa's service to the poor has evoked controversy but the organisation denied he criticised the Nobel laureate who spent her life in the service of the destitute.

మదర్ ధెరిస్సా సేవ వెనుక మత మార్పిడి: మోహన్ భగత్

Posted: 02/24/2015 09:45 AM IST
Rss chief kicks up row as he questions mother teresa s work

దేశంలో ఎలాంటి మత ఘర్షణలకు చోటులేదని మోదీ ప్రకటించి వారం కూడా కాలేదు. బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కు చెందిన వారు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశానికి నిస్వార్థపూరితంగా సేవలు చేసి, ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మదర్ థెరిస్సాపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మొహన్ భగత్ వ్యాఖ్యలు సంచనంరేపుతున్నాయి. మదర్ థెరిస్సా సేవ వెనుక, క్రైస్తవ మార్పిడి అసలు ఉద్దేశం అని ఆయన అన్నారు. మత మార్పిడి ప్రశ్నే కాదని, కానీ సేవ పేరుతో మార్పిడికి పాల్పడటమే అభ్యంతరకరమని అన్నారు. దేశంలోని పేదలను సేవల ద్వారా మత మార్పిడికి పాల్పడటం వల్ల ఆమె అందించిన సేవకు విలువ లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఎన్జీఓలు మాత్రం ఇక్కడ పేద, నిస్సహాయులైన ప్రజలకు సేవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సేవలు మదర్ థెరిస్సా మాదిరిగా ఉండవని మోహన్ భగత్ వివరించారు.

మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై మిగతా పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. మదర్ థెరిస్సా సేవలపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబధ్దం అంటూ కాంగ్రెస్ కొట్టి పారేసింది. మదర్ థెరిస్సా సేవలు ప్రపంచానికే ఆదర్శప్రాయమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మదర్ థెరిస్సా చాలా గొప్ప వ్యక్తి, ఆమెపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సరికావని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఆర్ఎస్ఎస్ ఇలాంటి వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ తన ట్విట్టర్ ఖాతాలో ఖండించారు. మొత్తానికి మదర్ థెరిస్సా విషయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం దురదృష్టం.
 - అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rss  mohanbhagath  mother theresa  service  kejriwal  sachin pilot  trinamol congress  religion  converting  

Other Articles

Today on Telugu Wishesh