President addressed both houses of parliament

president, mukharjee, paliament, modi, govt policy, poverty, jan dhan, smart city

President Pranab Mukherjee today addressed both houses of Parliament, marking the start of the budget session. He said "Sab ka Saath, Sab ka Vikas (taking everyone along, development for all)" is the government's fundamental tenet.

ప్రభుత్వ లక్ష్యాలను తెలిపిన రాష్ట్రపతి..వినిపించని ప్రత్యేకం మాట

Posted: 02/23/2015 01:34 PM IST
President addressed both houses of parliament

పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రభుత్వ లక్ష్యాలను ఆయన వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, విజయాలు ఇలా అన్నింటిని రాష్ట్రపతి కూలంకుషంగా చర్చించారు. రాష్ట్రపతికి ప్రధాని మోడీ, రాజ్యసభ, లోక్ సభ స్పీకర్లు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. పారిశుధ్యం నుండి మొదలు కొని స్మార్ సిటీల వరకు అన్నింటిపైనా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని స్పష్టం చేశారు. ఉపాధి కల్పన, ఉత్పత్తి పెంపు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగాలని రాష్ట్రపతి కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కృషి చేస్తుందన్నారు. ధరల తగ్గింపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని, జన్ ధన్ యోజనలో 13.2 కోట్ల బ్యాంకు ఖాతాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. పేదవాడి కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలన్నారు. భారత్ ను మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్ల నిర్మాణం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

కాగా రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల ఊసు వినిపించలేదు. ప్రత్యేక హోదా కల్పించడం గురించి, కనీస ఒక్క మాట కూడా లేపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కొన్నాళ్ల నుండి డిమాండ్ లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. అయినా రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం తెలుగు రాష్ట్రాల పేర్లెత్తకపోవడం గమనార్హం. అయితే ఏపికి ప్రత్యేక హోదా పై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని ప్రకటన చేస్తారని అప్పుడే ఊహాగానాలు కూడా మొదలవుతున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : president  mukharjee  paliament  modi  govt policy  poverty  jan dhan  smart city  

Other Articles