Pm modi in teacher avatar tells students to have belief in themselves

modi. manki baat, radio, students, stress, warriers, worriers, cricket, pm modi

Prime minister Narendra Modi's much-awaited Mann ki Baat on the topic of exams on an eventful Sunday must have come as a great stress buster for crores of students who are right now going through torrid times

విద్యార్థులకు మోదీ పాఠాలు

Posted: 02/23/2015 09:02 AM IST
Pm modi in teacher avatar tells students to have belief in themselves

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు దిశానిర్దేశం చేశాడు. విద్యార్థులు తమ భవిష్యతును తామే స్వయంగా నిర్మించుకోవాలని సూచించాడు. అయితే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే వారితో పోలుస్తున్నారని, దాని వల్ల విద్యార్థుల మనోస్థైర్యం దెబ్బతింటొందని ఆయన అన్నారు. మన్ కీ బాత్ పేరుతో ఆకాశవాణిలో ప్రసంగించిన మోదీ, తాజాగా విద్యార్థులకు తన సందేశాన్ని పంపాడు. ప్రస్తుతం క్రికెట్ సమరం నడుస్తోంది కాబట్టి ఆయన క్రికెట్ ను ఉదాహరణగా చెప్పాడు. క్రికెట్ ఆటగాడు గత మ్యాచ్ ల గురించి ఆలోచించడని, భవిష్యత్ మ్యాచ్ ల గురించి భయపడడని అన్నారు. అప్పటికప్పుడు మ్యాచ్ లో ఎలా ఉండాలో చూసుకుంటాడని అన్నారు.

విద్యార్తులు మరి కొద్ది రోజుల్లో పరీక్షలకు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలొ మోదీ మన్ కీ బాత్ ఎంతో ఉత్సాహంగా సాగింది. రేపటి మీ భవిష్యత్తుకు మీరే విధాతలు అని ఆయన మాటలు ఎంతో మంది విద్యార్థులకు స్పూర్తిని నింపాయి. ఎంతో మంది గొప్ప వ్యక్తులను ఉదరిస్తు మోదీ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. తను చిన్నప్పుడు ఎలాగోలా పాస్ అయ్యే వాడినని, తన రాత అర్థం కాకుండా ఉండేదని విద్యార్థులకు వివరించాడు. విద్యార్థులు అంటే వారియర్స్ అని, వర్రియర్స్ కాదు అని చెప్పిన మాటలు దేశం శ్రద్దగా వింది. ఎన్నికల్లో అన్ని పార్టీల బెండు తీసిన మోదీలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది మన్ కీ బాత్ కార్యక్రమం. మొత్తానికి మోదీ ప్రసంగం అటు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi. manki baat  radio  students  stress  warriers  worriers  cricket  pm modi  

Other Articles