Oscar 2015 award function started at losangeles

oscar 2015, los angeles, Academy Award, ida, interstellar, big hero-6, simens,

Los Angeles: The Oscars red carpet has been rolled out to honour the best in cinematic world. The 87th celebration of Academy Award at Dolby Theatre in Hollywood on Sunday is going to be speckled with some dazzling performance by musicians, dancers and actors all over the world.

ప్రారంభమైన ఆస్కార్-2015 అవార్డుల ప్రధానం

Posted: 02/23/2015 09:30 AM IST
Oscar 2015 award function started at losangeles

ప్రపంచ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ స్టార్స్ తమదైన లుక్ లో కనిపించి అందిరిని ఆకట్టుకున్నారు. ప్రపంచ సినిమా రంగానికి చెందిన కళాకారులు ఆస్కార్ అవార్డుల పోటీలో నిల్చున్నారు. 87 వ ఆస్కార్ అవార్డులకు లాస్ ఏంజెల్స్ లోని డోల్బీ ధియేటర్ లో భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తమ సహాయ నటుడుగా జేకే సిమన్స్ అవార్డు అందుకున్నారు. విప్లాష్ చిత్రంలో నటనకుగాను 60 ఏళ్ల సిమన్స్కు ఈ పురస్కారం దక్కింది. హాలీవుడ్ తారల హంగామాతో 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం 'వెటరన్ ప్రెస్1', ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా ది గ్రాండ్ బుడా పెస్ట్ హోటల్ సినిమాకు గాను మలోనకు దక్కింది. ఉత్తమ సహాయ నటి- పెట్రిసియా ఆర్వైడ్, ఉత్తమ సౌండ్ ఎటిడింగ్- అమెరికన్ స్నైపర్, బెస్ట్ యానిమేటెడ్ మూవీగా బిగ్ హీరో-6, బెస్ట్ ఫారెన్ ల్యాంగ్వేజ్ ఫిల్మ్ గా పోలాండ్ సినిమా ఐడాకు దక్కింది. బెస్ట్ లైవ్ యాక్షన్ ది ఫోన్ కాల్ , బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంటర్ స్టెల్లార్ లకు దక్కాయి.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oscar 2015  los angeles  Academy Award  ida  interstellar  big hero-6  simens  

Other Articles