Son stages kidnap drama in hyderabad

son stages kidnap drama in hyderabad, habited to pleasures, mumbai vijay stages kidnap drama, vijay father got Suspicion on son, vijay father approches police, panjagutta police, crime news, hyderabad crime news, kidnap drama., vijay rohan, blackmail, arrest,

son stages kidnap drama in hyderabad, after habitted to pleasures

తనకు తానే కిడ్నాప్ చేసుకున్న తనయుడు.. తండ్రి అందోళన

Posted: 02/22/2015 01:35 PM IST
Son stages kidnap drama in hyderabad

జల్సాలకు అలవాటుపడ్డాడు, ఆపైగా తనకున్న సినిమా తెలివితేలటన్నింటినీ వాడాడు. తండ్రిని బ్లాక్ మెయిల్ చేశాడు.. కటకటాలు లెక్కపెడుతున్నాడు. మంచి ఉద్యోగం చేస్తూ తండ్రి ఆసరాగా నిలిచిన సుపుత్రుడు.. చెడు మార్గాలు, దుర్యసనాలకు అలవాటు పడి, జల్సాలకు లోనయ్యాడు. సినిమా ఫక్కీలో కిడ్నాప్ డ్రామాకు స్కెచ్ వేశాడు. తనను తానే కిడ్నాప్ చేసుకుని తండ్రి నుంచి డబ్బు లాగాడు. అంతే జంజారాహిల్స్ లో తన రూమ్ లో సేద తీరాల్సిన వాడు.. చెరసాలలో చేసిన తప్పకు చింతిస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన విజయ్ రోహన్ (23) బంజారాహిల్స్ రోడ్ నెం-2లో హాస్టల్లో ఉంటూ సోమాజిగూడలోని ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కార్లలో తిరగడం, ఖరీదైన హోటళ్లలో బస చేసి జల్సాలు చేయడం ఇతని హాబీ జల్సాలకు జీతం డబ్బు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు సినిమా ఫక్కీలో కిడ్నాప్ డ్రామాకు స్కెచ్ వేశాడు. తనను తానే కిడ్నాప్ చేసుకుని తండ్రి నుంచి డబ్బు లాగాడు. ఈ నెల 16న తన ఫోన్ నుంచే ముంబైలో ఉండే తండ్రికి ఫోన్ చేసి... డబ్బు కోసం కొందరు తనను కిడ్నాప్ చేశారని, వెంటనే తన బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేయాలని ఒత్తిడి చేశాడు.

ఎవరికైనా చెప్తే కిడ్నాపర్లు తనను చంపేస్తారని, ఎవరికీ చెప్పవద్దని తండ్రితో తెలిపాడు. 16వ తేదీ నుంచి శుక్రవారం వరకూ తన అకౌంట్లో తండ్రితో రూ.లక్షా 93 వేలు వేయించుకుని జల్సా చేశాడు. కిడ్నాపర్లు మళ్లీ డబ్బు అడుగుతున్నారని మళ్లీ తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి నేరుగా నగరానికి వచ్చాడు. విజయ్కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పడంతో అతను పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కొడుకే డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడాడని నిర్థారించారు. నిందితుడు విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidnap drama.  vijay rohan  blackmail  arrest  

Other Articles

 • Nvs reddy key statements on hyderabad metro rail second phase and routes

  మెట్రో రైలు రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కీలక ప్రకటన

  Feb 25 | హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మెట్రో రెండు దశలో భాగంగా.. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వరకు... Read more

 • Nirbhaya case supreme court defers hearing of centre s appeal to march 5

  ‘నిర్భయ’ కేసు: దోషులకు ఈ సారైనా శిక్ష అమలయ్యేనా.?

  Feb 25 | దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే దోషులు శిక్షను తప్పించుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషించడంతో పాటు ఏకంగా తలను జైలు... Read more

 • Irctc archanam tour train from secundrabad to tirumala

  ఐఆర్సీటీసీ అర్చనం టూర్.. సికింద్రాబాద్ నుంచి తిరుమల

  Feb 25 | తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఇఆర్సీటీసీ మరో శుభవార్త చెప్పింది. తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? తిరుపతి టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం... Read more

 • Couple from hyderabad and one other killed in car crash in dallas

  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారి దుర్మరణం

  Feb 25 | అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న ఫోర్డ్ కారు అతివేగంగా వచ్చి తెలుగువారు ప్రయాణిస్తున్న అక్యూర కారును ఢీకొన్నడంతో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.... Read more

 • Us first lady melania trump arrives at govt school to attend happiness class

  ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో్ల మెలానియా.. పిల్లలతో సరదాగా..

  Feb 25 | అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. దక్షిణ మోతీబాగ్‌ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్‌ సీనియర్‌ సెకండరీ పాఠశాలకు వచ్చిన మెలానియాకు అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం... Read more

Today on Telugu Wishesh