Car bobms explosion in somalia and killed 20 men

somalia explosion, car bomb, al shabab, somalia militants, somalia,

in somalia capital, militants explose two car bombs near a hotel, where govt officials, ministers will stay. two saomalia ministers also highly injured in the exposion. somalia president condemned the incident.

సోమాలియాలో పేలిన కార్ బాంబులు..20 మంది మృతి

Posted: 02/21/2015 11:02 AM IST
Car bobms explosion in somalia and killed 20 men

సోమాలియా రాజధాని మోగడీషులోని రద్దీ ప్రాంతంలో కార్ బాంబ్ పేలింది. దేశానికి చెందిన రాజకీయ ప్రముఖులు తరుచూ వచ్చే హోటల్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు చోట్ల జరిగిన బాంబ్ పేలుల్లలో 20 మంది చనిపోయినట్లు సొమాలియా పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇద్దరు సొమాలియా మంత్రులకు కూడా తీవ్రగాయాలైనట్లు సమాచారం. అయితు అందులో ఒక మంత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఈ దాడులకు బాధ్యతబహిస్తున్నట్లు అల్-షబాబ్ అనే తీవ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే బాంబ్ పేలుల్ల ఘటనపై సొమాలియా అధ్యక్షులు అసన్ షేక్ మహమూద్ విచారం వ్యక్తం చేశారు. దేశంలో మరోసారి తీవ్రవాదుల దాడి జరిగిందని, అయినా తీవ్రవాదులపై పోరును ఆపేది లేదని ఆయన ప్రకటించారు. కాగా మా విధానాలకు అడ్డుగా నిలుస్తున్న ప్రభుత్వంపై తమ దాడి అని, అందుకే మంత్రులు, ముఖ్య అధికారులు ఉండే హోటల్ పై దాడి చేశామని అల్-షబాబ్ తరఫున షేక్ అబు ముసబ్ తెలిపారు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : somalia explosion  car bomb  al shabab  somalia militants  somalia  

Other Articles