Kcr resond on news of trs will collabarate with nda

kcr, trs, nda, modi, media, nda alliance, cm kcr,

kcr resond on news of trs will collabarate with nda: telanagana cm kcr resond on the news of trs collabarates with nda. kcr told that they are not oppose and not supportal.

ఎలాంటి సంప్రదింపులు జరపలేదు: కెసిఆర్

Posted: 02/21/2015 10:18 AM IST
Kcr resond on news of trs will collabarate with nda

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ఎన్డీయే సర్కార్ తో చేతులు కపలడానికి టిఆర్ఎస్ సిద్దమవుతోందన్న వార్తలపై కెసిఆర్ స్పందించారు. కానీ వార్తలపై ఎలాంటి ముగింపు ఇవ్వలేదు. ఎన్నికల సందర్భంగా మోదీని తిట్టిన కెసిఆర్, తర్వాత తన పంథా మార్చుకున్నారు. మోదీ సర్కార్ అధికారంలో ఉండటం మన అదృష్టం అని వ్యాఖ్యానించారు. మోదీ కార్యక్రమాలపై కూడా ప్రశంసల జల్లు కురిపించారు.దాంతో ఎన్డీయేతో టిఆర్ఎస్ జట్టు కడుతుందని వార్తలు వచ్చాయి. కొందరు టిఆర్ఎస్ శ్రేణులు కూడా వాటిని సమర్థించారు. ఇక టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక అడుగు ముందుకు వేసి, కెసిఆర్ తన కూతురు కవితకు కేంద్ర మంత్రి పదవి కోసమే మోదీతో దోస్తీ అంటున్నారని ప్రకటించారు. దాంతో ఎన్డీయేలో చేరిక, మంత్రి పదవుల కేటాయింపులపై మీడియాలో పలు వార్తలు వచ్చాయి. దాంతో కెసిఆర్ స్పందిస్తు మోదీ సర్కార్ కు తాము అనుకూలం కాదని, అదే సమయంలో వ్యతిరేకమూ కాదని ప్రకటించారు. ఎన్డీయేలో చేరిక విషయమై తాము ఇప్పటిదాకా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆయన వెల్లడించారు. దాంతో విషయంపై ఎటూ క్లారిటీ రాలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  trs  nda  modi  media  nda alliance  cm kcr  

Other Articles

Today on Telugu Wishesh