Ap govt order to attach agrigold abhaya golds propertys

agri gold, abhaya gold, ap govt, agri gold agents, agri gold costumers, agri gold in ap,

ap govt order to attach agrigold, abhaya golds propertys: agri gold has cheat the agents, customers in telanagan and andhrapradesh. several police cases filed againist the agri gold in two states. ap decided to investigate the probe with cid.

అగ్రిగోల్డ్, అభయగోల్డ్ ఆస్తుల జప్తు

Posted: 02/21/2015 09:48 AM IST
Ap govt order to attach agrigold abhaya golds propertys

తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కస్టమర్ల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి, వారికి హ్యాండిచ్చిన సంస్థ అగ్రిగోల్డ్. తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది కస్టమర్లు, ఏజెంట్ల వద్ద నుండి వందల కోట్ల రూపాలు వసూలు చేసిన అగ్రిగోల్డ్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు బ్యాంకింగ్ కార్యకలాపాలు చెయ్యడానికి ఎలాంటి అనుమతులు కూడా లేని అగ్రిగోల్డ్ లాంటి సంస్థ, తమ ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టింది. తాము నమ్మిన సంస్థ ఇలా తమకు అన్యాయం చెయ్యడంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ పై పలు కేసులు నమోదయ్యాయి.

కోట్ల రూపాయలు బొక్కేసిన అగ్రిగోల్డ్ సంస్థపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిఐడితో విచారణ చేయిస్తోంది. తాజాగా అగ్రిగోల్డ్ , అభయగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం జప్తు చెయ్యాలని నిర్ణయించింది. అందుకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలు చేస్తు, కోట్ల రూపాలయలను వసూలు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ పలు ఆస్తులను సంపాదించింది. అయితే అగ్రిగోల్డ్ పేరు మీద ఉన్న ఆస్తుల్లో చాలా వరకు బ్యాంక్ లకు తనఖాలో ఉన్నాయి. ఇక అగ్రిగోల్డ్ కు చెందిన మరో సంస్థ అభయగోల్డ్ కూడా మాతృసంస్థలానే చాలా మంది కస్టమర్ల దగ్గరి నుండి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. దాంతో ఏపి ప్రభుత్వం రెండు సంస్థల ఆస్తుల జప్తుకు ఆదేశించింది.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agri gold  agri gold managment  customers of agri gold  agri gold agents  

Other Articles