Ear phones health problems duff cause brain diseases

ear phones health problems, mobile health problems, brain disease, ear phones tips, ear phones health tips, mobile health tips, ear phones cause diseases, ear phones peace problems

ear phones health problems duff cause brain diseases : If Ear Phones use regularly.. then many health problems have to face from which everyone will lose patience and peace.

‘ఇయర్ ఫోన్స్’ వాడితే.. ‘ఇవి’ కోల్పోతారు!

Posted: 02/20/2015 09:18 PM IST
Ear phones health problems duff cause brain diseases

ప్రస్తుతకాలంలో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువయిపోయింది. వాకింగ్ కు వెళ్లినా, జాగింగ్ కు వెళ్లినా, పనిచేస్తున్నా.. ఇలా ఎక్కడ చూసినా ప్రతిఒక్కరు చెవుల్లో ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తుంటాయి. నిజానికి ఇవి వాడటం మంచిదే! నేరుగా ఫోన్ ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే.. దాని ఫ్రిక్వెన్సీస్ మెదడుకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అలాంటప్పుడు ఇయర్ ఫోన్స్ వాడిటంలో ఎటువంటి ప్రమాదం లేదు. కానీ.. ఫ్యాషన్ అన్న పేరుతో దాన్ని మరీ విపరీతంగా వాడేస్తున్నారు. అలా నిత్యం ఇయర్ ఫోన్స్ వాడటం కూడా చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలోని నేషనల్ పార్క్ సర్వీసెస్ సహకారంతో సెంటిస్ట్ కర్ట్ ఫ్రిస్టప్ టీం ఈ ఇయర్ ఫోన్స్ వాడకంపై ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. వీటి వాడకం పెరిగే కొద్దీ మానవులు కొన్ని విలువైన స్వభావాలు కోల్పోతారని వెల్లడయ్యింది. అవేమిటంటే..

1. నిత్యం చెవుల్లోనే ఇయర్ ఫోన్ వాడటంతో దానిమీదే ఎక్కువ ధ్యాస వుంటుంది. తద్వారా ఇతరులతో మసలుకునే స్వభావం తగ్గిపోతుంది. దీంతో ఒంటరితనం పెరిగిపోతుంది.

2. మానసిక ప్రశాంతత దూరమవుతుంది. నిత్యం పాటలు వినడంతో ఆ శబ్దాలు ఇయర్ ఫోన్స్ తీసిన తర్వాత కూడా వినిపిస్తూనే వుంటాయి. దీంతో ప్రశాంతతను కోల్పోయి, కాస్త ఇబ్బందికి గురవుతారు.

3. వీటిని వాడటం కారణంగా సహజమైన ప్రకృతి కిలకిలరావాలు ఆస్వాదించలేరు.

4. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే.. చెవుడు సమస్య చాలా త్వరగా వస్తుందట!

కాబట్టి.. ఇయర్ ఫోన్స్ ను ఎంత తక్కువగా వాడితే అంతే మంచిది! చెవులకు, మానసిక ప్రశాంతతను పొందాలంటే.. వాటిని దూరంగా వుంచడమే బెస్ట్. అయితే ఫోన్ లో సంభాషణలు జరిపేటప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ear phones health problems  mobile problems  

Other Articles