On the issue of linga cinema of rajinikath his fans to support

rajinikanth, linga cinema, super star, linga distributers, rajinikanth fans, sonakshi in linga, anushka in linga, linga release.

on the issue of linga cinema of rajinikath, his fans to support : the linga cinema of rajinikanth released on december. the movie didnt reach the expectations. the distributers of this cinema is going to strike. the rajini fans also respond on this issue

లింగా డిస్ట్రిబ్యూటర్లు Vs రజినీ అభిమానులు

Posted: 02/20/2015 09:37 AM IST
On the issue of linga cinema of rajinikath his fans to support

లింగా సినిమా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డిసెంబర్ నెలలో విడుదలైన లింగా సినిమా ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ప్రజాదరణ పొందలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయామంటూ రోడ్డెక్కారు.  నిరాహారదీక్షలు ఆందోళన బాటపట్టారు. డిస్టిబ్యూటర్ల ఆందోళనతో సూపర్ స్టార్ రజినీ కాంత్ కలగజేసుకున్నారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ 10 శాతం నష్టపరిహారం చెల్లించేలా ఒప్పించారు.  అయినా శాంతించని డిస్ట్రిబ్యూటర్లు ఇక రజనీకాంత్‌ను నమ్మి ప్రయోజనం లేదని భిక్షాటన చేస్తామంటూ ప్రకటించారు. రజనీకాంత్ ఇంటి నుంచే ఈ భిక్షాటన పోరాటం మొదలెడుతామని వెల్లడించారు. అయితే డిస్ట్రిబ్యూటర్ల కు ఓ రాజకీయ నేత అండగా నిలుస్తున్నారని సమాచారం. రజినీకాంత్ ఇంటి నుండే భిక్షాటన ప్రారంభించాలని ఆయనే సలహా ఇచ్చారని సమాచారం.

దాంతో రజినీ కాంత్ అభిమానులు రంగంలోకి దిగారు. రజినీకి బాసటగా తామున్నామని, రాత్రికి రాత్రికి పోస్టర్లు వెలిశాయి. డిస్ట్రిబ్యూటర్లు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే లింగా సినిమా వ్యవహారం చిలికిచిలికి గాలి వానగా మారుతోంది. నిన్నటి దాకా డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఉంటే ఇప్పుడు రజినీ అభిమానులు కూడా ఇందులోకి రావడం కొంత కలవరపెడుతోంది. అయితే పోలీసులు డిస్ట్రిబ్యూటర్ల భిక్షాటనకు అనుమతి ఇస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఇస్తే ఉద్రిక్తత నెలకొనే అవకాశాలు ఉన్నాయి. రజినీకి అండగా నిలుస్తుందనుకున్న సైత్ సినిమా ఇండస్ట్రీ సమాఖ్య కూడా స్పందించడకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనంలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  linga cinema  super star  linga distributers  rajinikanth fans  

Other Articles