బాలీవుడ్ శృంగారతారగా పేరొందిన మల్లికా శరావత్ తో నటించే ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా..? ఛస్తేగానీ వదులుకోరు! కానీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం ఆ సదావకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అయితే.. ఈ ఆఫర్ వచ్చింది ఇప్పుడు కాదులెండి.. ఆయన సీఎం కాకముందు!
ఆమధ్య ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్.. తొలిసారే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే! ఓ సామాన్య వ్యక్తి ఈ విధంగా విజయం సాధించడంతో సాధారణ వ్యక్తులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు అభిమానులయ్యారు. ఈ నేపథ్యంలో మల్లికా షెరావత్ కూడా ఆయనపై ఫిదా అయిపోయింది. ఆ సమయంలోనే ఆమె నటించిన ‘డర్టీ పాలిటిక్స్’ చిత్రంలో కేజ్రీవాల్ కు జర్నలిస్ట్ గా నటించే ఓ పాత్ర లభించిందట! అయితే.. దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారట!
అప్పుడే పార్టీని స్థాపించడం, తర్వాత సీఎం అవడంతో సమయాభావం వల్ల ఆ ఆఫర్ ని నిరాకరించినట్లు సమాచారం! దాంతో ఆ పాత్రలో నటుడు నసీరుద్దీన్ షాను తీసుకున్నారట! ఈ మొత్తం కథను తాజాగా ఆయన పార్టీ వర్గాలు బహిర్గతం చేశాయి. మొత్తానికి తనకొచ్చిన క్రేజీ ఆఫర్ ను కేజ్రీవాల్ వదులుకున్నాడన్నమాట!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more