Ramanaidu final rites

Ramanaidu final rites, Ramanaidu assets, kodi ramakrishna, vikram, ms narayana sin vikram, lb sriram, tollywood, ramanaidu funeral with government honours, movie mughul ramanaidu, star producer ramanaidu, last rites with government honours, ramanaidu collections, ramanaidu passes away, Daggubati Ramanaidu, funeral, Telugu Film Industry Closed Today, Ramanaidu Cremation news, Daggubati Ramanaidu no more, Daggubati Ramanaidu passed away, Daggubati Ramanaidu died, Daggubati Ramanaidu death news, Daggubati Ramanaidu news, Daggubati Ramanaidu wiki, Daggubati Ramanaidu movies, Daggubati Ramanaidu dead body, Daggubati Ramanaidu dead body phots, Daggubati Ramanaidu, ramanaidu cremation at ramanaidu studios

tollywood star producer, movie mughal final rites completed

ముగిసిన మూవీమొఘల్ అంత్యక్రియలు

Posted: 02/19/2015 06:41 PM IST
Ramanaidu final rites

ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు. రామానాయుడు స్టుడియోలో నిర్వహించిన ఆయన అంతిమ సంస్కార యాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పాలొ్గన్నారు. వేలాది అభిమానులు కన్నీటి వీడ్కోల మధ్య ఆయనకు హిందూ సంప్రదాయం ప్రకారం రామానాయుడు పెద్దకుమారుడు దగ్గుబాటి సురేష్ దహన సంస్కారాలు నిర్వహించారు. సురేష్ వెంట ఆయన సోదరుడు, టాలీవుడ్ అగ్రనటుడు వెంకటేష్ ముందు నడిచారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు ముగిసాయి. పోలీసులు తమ తుపాకుల గుళ్లను గాల్లోకి గురిపెట్టి రామానాయుడు మృతికి సంతాపాన్ని వెలిబుచ్చారు.
 
అంతకుముందు రామానాయుడు భౌతికకాయాన్ని  ప్రజల సందర్శనార్థం  ఆయన సొంత స్టూడియోకు తరలించారు.  రామానాయుడి నివాసం నుంచి పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో స్టూడియోకి తీసుకు వచ్చిన అనంతరం అభిమానుల సందర్శానర్థం మధ్యాహ్నం మూడు గంటల వరకూ స్టుడియోలోనే ఉంచారు. మూవీ మొగల్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా సంఖ్యలో హాజరు కావడంతో రామానాయుడి స్టుడియో అంతా జనసంద్రంగా మారింది. రామానాయుడి మృతితో సినీ పరిశ్రమ కన్నీటి సంద్రమైంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daggubati Ramanaidu  funeral  last rites  government honours  

Other Articles