India devoloping marine ships with 50 thousad cr

india defence system, 50 thousad cr., marine ships, pak on india, china with india

india devoloping marine ships with 50 thousad cr. : india ready to develope the entire defence. modi order to build new marine ships which can help to battle incase with china, pak war.

50 వేల కోట్లతో యుద్దనౌకలు..చైనా, పాక్ లకు భారత్ చెక్

Posted: 02/19/2015 03:09 PM IST
India devoloping marine ships with 50 thousad cr

భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠ పరచనుంది కేంద్ర ప్రభుత్వం. దాయాది దేశాలుగా మారిన పాక్, చైనా లను కట్టడి చెయ్యడానికి భారత్ ఎంతో చాకచక్యంగా పావులు కదుపుతొంది. అందులో భాగంగా మన రక్షణ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టింది. గత కొంత కాలంగా చైనా పాకిస్థాన్ స్నేహం భారత్ కు భవిష్యత్తులో చేటు చేస్తుంది. అందుకే భారత రక్షణ వ్యవస్థపై కొంత కాలం కిందట అధికారులు ప్రభుత్వానికి నివేదిక సిద్దం చేసింది. మన దేశంపైకి చైనా, పాక్ లు ఒకేసారి దాడికి దిగితే మన రక్షణరంగం వారిని కట్టడి చెయ్యలేదని, దేశానికి అది ఎంత మాత్రం మంచిది కాదని నివేదికలో తెలిపింది. అయితే మన దగ్గర ఉన్న రక్షణ సామాగ్రిని అప్ డేట్ చెయ్యాలని, పాత సామాగ్రిని తీయాల్సిందేనని నివేదికలో తెలిపింది.

నిఘా వర్గాలు కూడా భారత్ పై చైనా వైఖరిలో మార్పులు వస్తున్నాయని, భారత రక్షణ వ్యవహారాలపై చైనా ఓ కన్నేసి ఉందని హెచ్చరిస్తున్నాయి. భారత్ అన్ని విధాలుగా యుద్దానికి సిద్దంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు దిగింది. అందులో భాగంగా చైనా గత కొంత కాలంగా సముద్ర జలాల్లో చైనా ఆధిపత్యానికి భారత్ అడ్డుకట్ట వెయ్యాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా భారత్ వేల కోట్ల రూపాయలతో యుద్దనౌకలను తయారు చెయ్యాలని కేంద్రం నిర్ణయించింది. శ్రీలంక దగ్గరలో సముద్ర జలాల్లో చైనా ఇప్పటికే చాలా యుద్ద నౌకలను మోహరించి ఉంది.

గత కొంత కాలంగా భారత్ పై చైనా వ్యూహాత్మక వైఖరిని అవలంబిస్తోంది. పాకిస్థాన్ తోనూ చైనా వైఖరిలో చాలా మార్పు వచ్చింది. గతంలో భారత్ వ్యాపార రంగంపై మాత్రమే కన్నేసిన చైనా, క్రమక్రమంగా భారత్ భూభాగాలపైనా కన్నేస్తోంది. అందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను తన భూభాగంగా చూపుతోంది. దానిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని పౌరులకు చైనా తాత్కాలిక వీసాలను కూడా ఇవ్వడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ భూభాగాల్లోకి చొరబడి, అక్కడే సైనిక శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. తర్వాత భారత ప్రభుత్వంతో చర్చల ఫలితంగా సైనిక శిబిరాలను చైనా సైనిక దళాలు ఉపసంహరించుకున్నాయి. అలా ఏమాత్రం చిన్న అవకాశం వచ్చినా చైనా దాన్ని వినియోగించుకుంటుంది.

భవిష్యత్తులో చైనా నుండి భూతలం నుండి కానీ, జల మార్గం ద్వారా కానీ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. అందులో భాగంగా భారత్ శత్రుసైన్యాన్ని మట్టికరిపించేలా, ఏడు నౌకలను సిద్దం చేయనుంది. అణుబాంబులను ప్రయోగించలగల ఆరు జలాంతర్గాములను కూడా సిద్దపరచనున్నారు. మొత్తానికి భారత రక్షణ వ్యవస్థకు మరింత బలాన్నిచ్చేలా కేంద్రం చర్యలకు పూనుకోవడం మంచిదే.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india defence system  50 thousad cr.  marine ships  pak on india  china with india  

Other Articles