Deviprasad narederreddy contest from trs in mlc elections

deviprasad, narederreddy, mlc elections, trs, ngo leaders, kadium

deviprasad, narederreddy contest from trs in mlc elections? trs will announce the candidates who will contest in mlc elections from trs party. may deviprasad, narederreddy contest from trs. trs president kcr will announce today the names.

ఎమ్మెల్సీ బరిలో టిఆర్ఎస్ అభ్యర్థులు వీరేనా..?

Posted: 02/19/2015 09:09 AM IST
Deviprasad narederreddy contest from trs in mlc elections

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు పార్టీ తరఫున బరిలోకి దిగేది ఎవరో దాదాపుగా తెలిసిపోయింది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. తెలంగాణ నాన్‌గెజిటె డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి, నల్లగొండ టీఆర్‌ఎస్ కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డిని వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడం ఖాయమైంది.

తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా కలసి వచ్చిన ఉద్యోగ సంఘాలకు ఒక స్థానం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. దీంతో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవ ర్గం నుంచి ఉద్యోగ సంఘాల నేతలే ఎక్కువగా ప్రయత్నించారు. టీఎన్‌జీఓ నేత దేవీ ప్రసాద్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినా, ఆయన తనకు గవర్నర్ కోటా కావాలని కోరినట్లు సమాచారం. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వస్తే, తాను వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా దేవీ ప్రసాద్ మధ్యలో మరో ప్రతిపాదన తెచ్చారని సమాచారం.

వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి మొదట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ భావించినట్లు తెలిసింది. అయితే, కడియం శ్రీహరి సుముఖంగా లే కపోవడం, కొందరు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ ప్రయోగం సరికాదని అభిప్రాయపడడంతో కేసీఆర్ కూడా ఈ ఆలోచన విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కోసం ముందు నుంచీ ప్రయత్నాలు చేసిన నల్లగొండ టీఆర్‌ఎస్ కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డినే బరిలో దింపనున్నారని తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈనెల 26వ తేది వరకు మాత్రమే గడువుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deviprasad  narederreddy  mlc elections  trs  ngo leaders  kadium  

Other Articles