Agrigold central office for bidding

agri gold, , agri gold managment, customers of agri gold, agri gold agents, bidding, andhra bank

agrigold central office for bidding : agri gold central office which is located at vijayawada is going to bidd. andhra bank gave loan to agrigold on the agrigold office. the agrigold managment failed to pay instalments so the bank officials trying to bidd the property of the agri gold.

వేలానికి అగ్రిగోల్డ్ కార్యాలయం..?

Posted: 02/19/2015 08:33 AM IST
Agrigold central office for bidding


అగ్రిగోల్డ్...తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కస్టమర్ల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి, వారికి హ్యాండిచ్చిన సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది కస్టమర్లు, ఏజెంట్ల వద్ద నుండి వందల కోట్ల రూపాలు వసూలు చేసిన అగ్రిగోల్డ్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు బ్యాంకింగ్ కార్యకలాపాలు చెయ్యడానికి ఎలాంటి అనుమతులు కూడా లేని అగ్రిగోల్డ్ లాంటి సంస్థ, తమ ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టింది. అయితే అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం కూడా బ్యాంక్ తనఖాలో ఉన్నట్లు తాజాగా తెలిసింది. ఆంధంకా బ్యాంక్ నుండి వంద కోట్లకుపైగా లోన్ తీసుకున్న అగ్రిగోల్డ్ విజయవాడ కార్యలయాన్ని, దాంతో పాటు మరికొన్నింటిని బ్యాంకుకు తనఖా ఉంచింది.

బ్యాంక్ వద్ద తీసుకున్న లోన్ ను తీర్చడంలో అగ్రిగోల్డ్ సంస్థ విఫలమైంది. గత కొంత కాలంగా కస్టమర్లకు తిరిగి డబ్బులు చెల్లించని అగ్రిగోల్డ్, బ్యాంక్ కు కూడా వాయిదాలు చెల్లించలేదు. మొత్తానికి ఇలా అగ్రిగోల్డ్ సంస్థ మోసానికి పాల్పడిందని, గత కొంత కాలంగా మీడియాలో వస్తున్న వార్తలతో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు, తమ వద్ద తనఖాలో ఉన్న కార్యాలయానికి సంబందించిన వివరాలను తెలిపారు. పైగా అగ్రిగోల్డ్ విజయవాడ కార్యాలయాన్ని వేలం వెయ్యడానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఇలా ఫైనాన్సియల్ ఛీటింగ్ లకు పాల్పడుతున్న సంస్థలపై చట్టాలు కఠినంగా శిక్షించడం లేదు. చట్టాల్లోని లొసుగులను వాడుకొని ఇలాంటి బడా మోసాలకు ప్రభుత్వం ఎప్పుడు చెక్ చెబుతోందో ఏంటో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : agri gold  sebi  agri gold agents  agri gold costumers  agri gold in ap  

Other Articles