Human bomb attck in lahore

human bomb, lahore attack, police line, pakistan bomb attack

human bomb attck in lahore : in pakistans lahore city human bomb attck on police line. in this incident five members dead and 25 injured.

లాహోర్ లో పేలిన మానవ బాంబ్..ఐదుగురి మృతి, 25 మందికి గాయాలు

Posted: 02/17/2015 03:54 PM IST
Human bomb attck in lahore

పాకిస్థాన్ లో మారణహోమం కొనసాగుతైనే ఉంది. బాంబు పేలుళ్లతో ఎప్పుడు వార్తలకెక్కుతూ అసింహకు చిరునామాగా మారింది. లాహోర్ లో తాజాగా జరిగిన మానవ బాంబ్ పేలుడులో ఓ పోలీస్ అధికారితో పాటు ఐదు గురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో 25 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే పాక్ కీలకనగరంలో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని, పాక్ ఇంటలిజెన్స్ హెచ్చరించారు. లాహోర్ లోని పోలీస్ లైన్ లో ఘటన చోటు చేసుకుంది.  అయితే ఒక ఉగ్రవాది పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సిసిటివి పుటేజ్ లను పరిశీలస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాది 20 నుండి 25 సంవత్సరాల వాడని వారు నిర్దారణకు వచ్చారు.  పేలుడుకు 4 నుండి 5 కేజీల పేలుడు పదార్థాలను వాడినట్లు వారు భావిస్తున్నారు. పాకిస్థాన్ లో అంతకంతకు పెరుగుతున్న హింసను అరికట్టాలని ప్రపంచ దేశాలు గతంలోనే సూచించాయి. పెషావర్ లో జరిగిన మసీద్ దాడిలో 25 మంది పౌరులు మరణించిన ఘటన మరవక ముందే తాజాగా ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : human bomb  lahore attack  police line  pakistan bomb attack  

Other Articles