Villagers decided to pay amount for rape

bihar rape, rape on lady, navada rape incident

villagers decided to pay amount for rape : in bihar state navada dist. village men decided to pay amount for rape on lady. police file a case on the incident, and interagating.

ఇంకెన్నాళ్లీ కన్నీళ్లు...మహిళలపై దారుణాలు

Posted: 02/17/2015 03:36 PM IST
Villagers decided to pay amount for rape


మహిళలపై జరుగుతున్న దారుణాలు చాలా వరకు వెలుగులోకి రావడం లేదు. మహిళలపై అత్యాచారం చెయ్యడం, హత్యచెయ్యడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. బీహార్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు మరింత పెరుగుతున్నాయి. అందరిలా తమకు హక్కు ఉందని భావిస్తున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది. అత్యాచారానికి పాల్పడ్డందుకు 31 వేలు చెల్లించాలని ఓ గ్రామంలో గ్రామ పెద్దలు పంచాయితీ చేశారు. బీహార్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.

అత్యాచారానికి గురైన మహిళ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు పంచాయతీ పెద్దలు విలువ కట్టిన సంఘటన నవాడ జిల్లాలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి బాధితురాలిని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఈ విషయం పంచాయతీ దృష్టికి రావడంతో బాధితురాలికి 31 వేల రూపాయలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయరాదని బాధితురాలి కుటుంబ సభ్యులకు షరతు పెట్టారు. కాగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఈ మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించాడు. ఈ విషయం బయటకు చెబితే అంతు చూస్తానంటూ బాధితురాలిని బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. మీడియా జోక్యం చేసుకోవడంతో కేసు నమోదు చేశారు. బీహార్లోనే కటియా జిల్లాలో ఇలాంటి ఘటనలు రెండు వెలుగు చూశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar rape  rape on lady  navada rape incident  

Other Articles