Ap cabinet decided to announce new corporations

ap cabinet meeting, ap govt, new corporations in ap

ap cabinet decided to announce new corporations : ap cabinet decided to announce soon new corporations in ap. ap cabinet will grade municipalitys as three.

ఏపిలో కొత్త కార్పోరేషన్ లు...ఏపి క్యాబినెట్ తాజా నిర్ణయం

Posted: 02/16/2015 04:41 PM IST
Ap cabinet decided to announce new corporations

జనాభా ప్రాతిపదికన కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  కొత్త కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు జరిపిన తరువాత  అందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీ గ్రేడ్ లను ఆరు నుంచి మూడు గ్రేడ్ లుగా తగ్గించాలని కేబినెట్ తీర్మానించింది. దీంతో పాటుగా దేవాలయ కమిటీ పాలకవర్గం కాలపరిమితిన రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదిలా ఉండగా రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని ఏపీ కేబినెట్ భావిస్తోంది. ఈనెల 19న నీరు-చెట్టు కార్యక్రమం నిర్వహించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cabinet meeting  ap govt  new corporations in ap  

Other Articles