Yuvraj singh ipl 8 delhi dare devils franchise 16 crores

yuvraj singh news, yuvraj singh twitter, yuvraj singh facebook, yuvraj singh ipl season 8, ipl season 8 bidding, yuvraj singh controversial news, delhi dare devils match, delhi dare devils franchise

yuvraj singh ipl 8 delhi dare devils franchise 16 crores : Delhi franchise purchase yuvraj singh with 16 crores rupees in the ipl bidding.

నిద్రపోతున్న యువీని లేపినందుకు సంతోషంగా వుందట!

Posted: 02/16/2015 05:34 PM IST
Yuvraj singh ipl 8 delhi dare devils franchise 16 crores

ప్రపంచకప్ 2015లో భాగంగా టీమిండియా జట్టులో యువరాజ్ సింగ్ కు స్థానం దక్కని విషయం తెలిసిందే! యువీ ఎంపిక కాకపోవడంతో క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అలాగే యువీ కూడా తొలుత ఆవేదన వ్యక్తం చేసినా.. అనంతరం ప్రస్తుత జట్టు ఆటగాళ్లకు అభినందనలు తెలిపాడు. ఇక చేసేదేమీలేక ఇంట్లోనే సేదతీర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతను నిద్రపోతుండగా కొందరు సన్నిహితులు తట్టి లేపారు. అంతే.. ఇతని సంతోషానికి హద్దులేకుండా పోయింది. ఇంతకు ఏమి జరిగిందంటారు..? అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

వివరాళ్లోకి వెళ్తే.. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ -8 సీజన్ కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. బెంగుళూరులో ఈ సీజన్ ఆటగాళ్లకోసం వేలపాట మొదలెట్టేశారు. ఈ వేలంలోనే యువరాజ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీలు రూ.16 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే.. ఈ విషయం యువీకి తెలియదు. ఈ వేలం జరుగుతున్న సమయంలో అతడు గాఢనిద్రలో వున్నాడు. అప్పుడే కొంతమంది మిత్రులు వచ్చి.. తన వేలం విషయం గురించి వివరించారు. ఏకంగా 16 కోట్లకు అమ్ముడుపోవడంతో హర్షం వ్యక్తం చేసిన అతని మిత్రులు యువీని అభినందించారు. ఇదే విషయమై యువీ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

వేలం జరుగుతున్న సమయంలో తాను నిద్రపోతున్నానని, మిత్రులు కొంతమంది ఇంటికి వచ్చి అభినందించడంతో ఆ విషయం తెలిసిందని యువరాజ్ తెలిపాడు. మరోసారి గ్యారీ కిర్ స్టర్ కోచింగ్ లో ఆడబోతుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని అన్నాడు. గతంలో ఆయన శిక్షణలో మంచి విజయాలు సాధించానని తెలిపిన యువీ.. ఈసారి ఢిల్లీ డేర్ డెవిల్స్ తోనూ పునరావృతమవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అటు.. యువీ ఇంత రేంజిలో అమ్ముడుపోవడంపై క్రికెట్ అభిమానులతోపాటు దిగ్గజాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh latest news  delhi dare devils franchise  ipl season 8 bidding  

Other Articles