Yuvi sold for 16 crs in ipl 8 bidding

ipl-8 bidding, yuvaraj, amla, delhi daredevils, banglore royal challengers, morgan, dinesh karthik

yuvi sold for 16 crs in ipl-8 bidding : ipl-8 bidding going very intresting, yuvi sold for 16 cr. in the last ipl he sold for 14 cr. amla and jayavardhane notsold at this time.

యువరాజ్ సింగ్ @ 16 కోట్లు...కొనసాగుతున్న ఐపిఎల్ 8 బిడ్డింగ్

Posted: 02/16/2015 11:03 AM IST
Yuvi sold for 16 crs in ipl 8 bidding

క్రికెట్ సంగ్రామంలో మరో అంకానికి తెరలేచింది. రానున్న ఐపిఎల్ సీజన్ 8 కోసం ఇవాళ ఉదయం నుండి బిడ్డింగ్ జరుగుతోంది. ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్-8 వేలంలో యూవీని ఏకంగా 16 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది. గతేడాది యువరాజ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.14 కోట్లకు కొనుగోలు చేయగా ఈ సారి ఏకంగా 16 కోట్లు పలికాడు. మోర్గాన్ 1.5 కోట్లు, ఆరాన్ పించ్ 3.2 కోట్లు, అమిత్ మిశ్రాను ఢిల్లీ డేర్ డెవిల్స్ 3.5 కోట్లకు స్వంతం చేసుకుంది. దినేష్ కార్తిక్ ను బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 10.5 కోట్లుతో చేజిక్కించుకుంది. కెవిన్ పీటర్ సన్ 2 కోట్లు  కేన్ విలియమ్ సన్ 60 లక్షలు, ఏంజిలో మ్యాథుస్ 7.5 కోట్లు, మురళి విజయ్ 3 కోట్లు పలికారు. వరల్డ్ టాప్ ర్యాంకింగ్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లాను ఎవరూ కొనలేదు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్న ఆమ్లాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఆమ్లా ప్రాథమిక ధరను రూ. 2 కోట్లుగా నిర్ధారించారు. మహేలా జయవర్దనే కూడా ఇంకా అమ్ముడు పోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl-8 bidding  yuvaraj  amla  delhi daredevils  banglore royal challengers  morgan  dinesh karthik  

Other Articles