Swiss will reveal the details of their accounts on 2018

black money, sit, swiss, swiss banks, automatic information exchange,

swiss will reveal the details on 2018 : automatic information exchange will effect in swiss from 2018, untill india cant get the details of personns who have there money in swiss banks.

నల్లధనంపై వివరాలు కావాలంటే 2018 దాకా ఆగాలి

Posted: 02/16/2015 08:12 AM IST
Swiss will reveal the details of their accounts on 2018

భాజపా ఎన్నికల సందర్భంగా నల్లధనం మొత్తాన్ని వెనక్కి రపిస్తామని ప్రధానంగా హామీ ఇచ్చింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై విచారణకు సిట్ ను ేర్పాటే చేసింది. విదేశాల్లో నల్లధనాన్ని రప్పించాలంటే, విదేశాలు వారి దేశంలోని ఖాతాల వివరాలను ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఒక దేశం మరో దేశంతో సమాచారం పంచుకోవడానికి గతంలోనే ఆటోమాటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్ఛ్సేంజ్ కు భారత్ సహా చాలా దేశాలు ఆమోదం తెలిపాయి. అయితే భారత్ కు చెందిన చాలా నల్లధనం స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉందని సమాచారం. ఆటోమాటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్ఛ్సేంజ్ కింద 2017 నుండి భారత్ తన వద్ద ఉన్న వివరాలను అందించాల్సి ఉంటుంది. కానీ స్విట్జర్లాండ్ లో మాత్రం 2018 నుండి ఆటోమాటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్ఛ్సేంజ్ అమలుల్లోకి వస్తుంది. ఫలితంగా భారత్ కు చెందిన వారి వివరాలను 2018 కి కానీ స్విట్జర్లాండ్ వివరాలను అందించదు.

ఆటోమాటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్ఛ్సేంజ్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వారి అకౌంట్ నెంబర్, పేరు, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు, షేర్లు, బాండ్ల వివరాలు.. మొదలైన సమాచారం అంతా భారత్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ 2018 దాకా స్విస్ తన వివరాలను భారత్ అందించదు. ఇదే చాలా మందికి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. రాత్రికిరాత్రే అన్నింటిని తారుమారు చేసే మన వాళ్లు అప్పటి వరకు స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని ఎందుకు ఉంచుతారన్నది ప్రశ్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black money  sit  swiss  swiss banks  automatic information exchange  

Other Articles