Aap decided to spread to other states

:aap, aam admi party, kejriwal, nda, upa, third front, central govt, bjp, congress, majority

aap decided to spread to other states : aam admi party decided to spread the party to four to five states. aap trying to contest in the other states on next loksabha elections.

దేశానికి మరో ప్రత్యామ్నాయంగా ఆప్

Posted: 02/16/2015 08:47 AM IST
Aap decided to spread to other states

ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని స్వంతం చేసుకొన్న ఆప్ రానున్న లోక్ సభ ఎన్నికల్లోగా నాలుగు రాష్ట్రాలకు విస్తరించాలనే వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగానే ఆప్ నేతలు కార్యాచరణను సిద్దం చేస్తున్నారని సమాచారం. ఢిల్లీ ఎన్నికల తర్వాత బెంగళూర్ పై కన్నేసిన ఆప్, తాజాగా జాతీయ స్జాయిలో మరో ప్రత్యామ్నాయంగా అవతరించాలని ప్రయత్నాలను మొదటుపెట్టింది. అందులో భాగంగా ఆప్ వ్యూహకర్త యోగేంద్ర కుమార్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. రానున్న బీహార్, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో ఇరవై శాతం ఓట్లను సాధించాలని లక్షంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కాంగ్రెస్ , భాజపాలు కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. మధ్యలో తృతీయ కూటమి అంటూ వినిపిస్తున్నా, ఆ ప్రయత్నాలు ఫలించడ లేదు. తాజాగా ఆప్ వేస్తున్న అడుగులు కేంద్రంలో కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీగా ఆప్ నిలవాలని ఆప్ భావన.

ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్, పార్టీని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలనుకోవడం మంచిదే. కానీ ఆప్ ను ఢిల్లీలో అధికారంలోకి తెచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీకే తన సేవలను పరిమితం చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రసంగంలో ప్రకటించారు. కాగా దీన్ని కొందరు విశ్లేషకులు మరోలా విశ్లేషిస్తున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీకి తన సేవలు అంకితం అంటే భవిష్యత్తులో ప్రధాని కావడానికి చేస్తున్న ఎత్తుగడ అని అంటున్నారు. మొత్తానికి గత లోక్ సభ ఎన్నికల్లో విఫలమైన ఆప్, వచ్చే లోక్ సభ ఎన్నికలకు మాత్రం చాలా జాగ్రత్తగా సిద్దమవుతోంది. అదే గనక జరిగితే ఇప్పటి దాకా భాజపా, కాంగ్రెస్ లను కేంద్రంలో చూసిన దేశ ప్రజలు ఆప్ ను చూస్తారు. కానీ ఇప్పుడు భాజపా ఏర్పడ్డట్లు భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని  ఏర్పాటు చెయ్యాలి లేదంటే మెజారిటీ కోసం వేరే పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆప్ ఘన విజయం తర్వాత జెడియు, తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఆప్ కు మద్దతు ప్రకటించాయి. కానీ ఆప్ మాత్రం ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడానికి సిద్దంగా లేమని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు తమకు విధానపరమైన విభేదాలున్నాయని, అందుకే వాటికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆప్ ప్రకటించింది. అయితే ఢిల్లీలో విజయ పతాకాన్ని ఎగరవేసిన ఆప్, రానున్న కాలంలో ఎన్ని రాష్ట్రాల్లో విజయాన్ని స్వంతం చేసుకుంటుందో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : :aap  aam admi party  kejriwal  nda  upa  third front  central govt  bjp  congress  majority  

Other Articles