Helicopter made with car engine

helicopter made with car engine, tiruvallur assistant professor mohan, Helicopter, car engine, mohan, aeronautical engineering, jaya engineering college, mgr nagar,

tiruvallur assistant professor helicopter made with car engine

కారు ఇంజన్ తో హెలికాఫ్టర్.. సరికొత్త ప్రయోగం..

Posted: 02/08/2015 12:05 PM IST
Helicopter made with car engine

తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎంజీఆర్ నగర్ ప్రాంతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ తయారు చేస్తున్న హెలికాప్టర్ కలకలం రేపింది. తిరువళ్లూరు మున్సిపాలి టీ పరిధిలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన మోహన్ జయా ఇంజనీరింగ్ కళాశాలలోని ఏరోనాటికల్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఏరోనాటికల్ విభాగంలో చదివే విద్యార్థులకు నాలుగో సంవత్సరంలో విమానం, హెలికాప్టర్ పనితీరును నేరుగా తెలుసుకోవాల్సి ఉంది.

ఇందు లో భాగంగా జయా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఉపయోపడే విధం గా హెలికాప్టర్‌ను తయారు చేయాలని నిర్ణయించిన కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. అయితే అప్పటికే హెలికాప్టర్ తయారీలో ఆసక్తి వున్న మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. దీంతో మోహన్ హెలికాప్టర్ తయారీ పనులను ఇంటి వెనుక భాగంలో రెండు వారాల నుంచి కొనసాగిస్తున్నారు. అయితే శనివారం సాయంత్రం రెక్కలు అమర్చే పని వుండడంతో హెలికాప్టర్‌ను వీధిలోకి తెచ్చి పనులను నిర్వహించడం ప్రారంభించారు.
 
  హెలికాప్టర్ వీధిలోకి రావడంతో ఆశ్చర్యపోయిన స్థానికులు తిరువళ్లూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసు వర్గాలూ కలవరపాటుకు గురయ్యూరు. విషయం తెలుసుకున్న టౌన్ ఇన్‌స్పెక్టర్ పొన్‌రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మోహన్ తయారు చేస్తున్న హెలికాప్టర్‌కు ఎగిరే సామర్థ్యం లేదని, కేవలం ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధన కోసమే తయారు చేస్తున్నారని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.  
 
ఇంజనీరింగ్ విద్యార్థుల కోసమే తాము హెలికాప్టర్‌ను తయారు చేస్తున్నట్టు ప్రొఫెసర్ మోహన్ వివరించారు. తాము తయారు చేస్తున్న హెలికాప్టర్‌కు ఎగిరే సామర్థ్యం లేదని, తాము ఏరోనాటికల్ శాఖను అనుమతి కోరి నప్పడు సైతం ఇదే అంశాన్ని వారు గుర్తు చేశారని ఆయన వివరించారు. తాము తయారు చేసిన హెలికాప్టర్ పెట్రోల్‌తో నడుస్తుందని, కేవలం ఒక్కరు మాత్రమే ఇందులో ప్రయాణించే అవకాశం వుంటుందని వివరించారు. తాము తయారు చేస్తున్న హెలికాప్టర్ వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ వుండదన్నారు.  తమకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే హెలికాప్టర్‌ను తయారు చేస్తామని వివరించారు. ప్రస్తుతం తయారు చేసిన హెలికాప్టర్ కారు ఇంజన్‌తో పరుగెత్తుతుందని మోహన్ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Helicopter  car engine  mohan  aeronautical engineering  

Other Articles