Japan rule work holidays old age

japan , rules to have leaves, new rule in japan, workholics of japan

japan,rule work holidays old age : japan tried to amindement to use all leaves of japan. people of japan have health problems so govt. go for rule to use all leaves.

సెలవులు వాడుకోవాలంటూ చట్టం చేస్తారట

Posted: 02/07/2015 03:47 PM IST
Japan rule work holidays old age

నాణ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేసే జపాన్ ఇప్పుడు పని మాని సెలవులు వాడుకోవాలని చట్టం చేసింది.  అసలు సెలవులంటూ వారు మరిచిపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయట. కుటుంబంతో సరదాగా గడపడం లేదు. ఇది ఎంతగా మారిందంటే అక్కడ జనాభాలో ఎక్కువ మంది వృద్దులే. పిల్లలని కనడం మానడంతో పిల్లలు, యువకుల జనాభా తగ్గిపోయింది. దానికితోడు ఉద్యోగులు సెలవులు తీసుకోకపోవడంతో వారి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నట్టు  అధ్యయనాల్లో తేలింది.

భార్యాభర్తలకు ఏకాంతం చిక్కకపోవడంతో దాంపత్య జీవితం అంతంతేనని తేలింది. దీంతో ఈ ప్రభావం దేశ అభివృద్దిపైనా కనబడుతోంది. దాంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలకు పూనుకుంది. ప్రతి ఉద్యోగి తన సెలవులు పూర్తిగా వాడుకోవాల్సిందేనని చట్టం తేబోతున్నారు. వాళ్లు సెలవులను వాడుకునేలా చూసే బాధ్యత వారి బాస్‌దేనట! ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్టం తేవడానికి కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగులందరికీ  తగిన విశ్రాంతి ఉండేలా చూసేందుకు చట్టంలో 26 లక్ష్యాలను పొందుపరిచారు. ఇలాంటి చట్టం మన దేశంలో లేకున్నా దాన్ని హక్కుగా వాడుకుంటున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govt of japan to rule of leave  new rule in japan  

Other Articles