Ed summons to tmc mp arpita ghosh two matang sinh aides

ED summons to TMC MP Arpita Ghosh, ED summons two Matang Sinh aides, money laundering probe, Saradha chit fund case, mamatha banerjee, Trinamool Congress, srinoy roy, BJP, Balurghat MP Ghosh summoned, former Union minister Matang Sinh, Rs 90 crore of Matang Sinh property sinh,

ED has issued fresh summons to TMC MP Arpita Ghosh and two aides of Matang Sinh in connection with its money laundering probe in the Saradha chit fund case.

తవ్వె కొద్ది భయటపడుతున్న ‘శారదా’ నిందితులు

Posted: 02/07/2015 01:34 PM IST
Ed summons to tmc mp arpita ghosh two matang sinh aides

తృణముల్ కాంగ్రెస్ పార్టీని నిట్టనిలువునా చిలుస్తున్న అంశం శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసు. పార్టీ నుంచి పలువురి నేతలు బీజేపి పట్ల ఆకర్షితులై... వీడుతుండగా, మరికోందరు శారదా కుంభకోణంలో ఇరుక్కుని పార్టీని వీడుతున్నారు. మరికొందరు బలవంతన పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడైన సృజయ్ బోస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేయగా, మరి కొందరు కూడా అదే బాట పట్టనున్నారు.

తాజాగా శారదా గ్రూపు సంస్థల కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అర్పితా ఘోష్, కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సిన్హ్ సహాయకులు ఇద్దరికి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. అర్పితా ఘోష్‌ను ఈ నెల 13న తమ ముందు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. మాతంగ్ సిన్హ్ సహాయకులను వచ్చే వారంలో హాజరుకావాల్సిందిగా కోరింది.

ఇదిలా వుండగా శారదా గ్రూపు సంస్థల కుంభకోణంలో అరెస్టైయిన కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సిన్హ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. మనీ లాండరింగ్ చట్టం నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మాతంగ్‌సిన్హ్‌కు చెందిన రూ.90 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ చర్యలు చేపట్టింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Matang Sinh  Saradha scam  Trinamool Congress  

Other Articles