Delhi polling 2015 bjp vs aap

delhi elections 2015, delhi polling, delhi voter, aap in delhi, delhi govt.,bjp vs aap, kegriwal

delhi polling 2015 bjp vs aap : delhi voter decide the destination of all partys in delhi. very big fight bitween the aap and bjp. may ba poll percentage will raise.

ముగిసిన ఎన్నికల లొల్లి...నేడు ఓటెత్తిన ఢిల్లీ

Posted: 02/07/2015 10:43 AM IST
Delhi polling 2015 bjp vs aap

ఢిల్లీ లో వాతావరణం ఒక్క సారిగా చల్లారింది. మొన్నటి దాకా ఉన్న హడావిడి మాయమైంది. ఇన్నాళ్లు సాగిన ఎన్నికల  ప్రచారానికి ఢిల్లీ ప్రజలు తమ ఓటుతో తుది తీర్పు   ఇవ్వనున్నారు. బీజేపీ-ఆప్ ల మధ్య జరిగిన ఎన్నికల ప్రచారం యుద్దాన్ని తలపించింది. ఎన్నికల బరిలో నిలిచిన  673 మంది భవితవ్యాన్ని నేడు ఢిల్లీ ఓటరు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నాడు. 1.33 కోట్ల మంది ఓటర్లు తమ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమీషన్  12,083 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

గతంలో మెజారిటీ లేకపోవడంతో అధికారానికి దూరమైన బీజేపీ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ అధికారపగ్గాలను చేపట్టాలని తహతహలాడుతోంది. మరోపక్క గత ఎన్నికల్లో అధికారంలొకి వచ్చి కొన్ని రోజులు మాత్రమే ప్రభుత్వాన్నినడిపారు కేజ్రీవాల్. కానీ ఈ సారి మాత్రం ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని కొనసాగిస్తానని కేజ్రీ ప్రజలకు వాగ్దానం చేశారు. ఆప్ దూకుడుకు కళ్లెం వేసేందుకు బీజేపీ అనూహ్యంగా కిరణ్ బేడిని పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపింది.ముందు నుండి అన్నా హజారేతో ఉండి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీతొ కలిసి కిరణ్ బేడి పాలుపంచుకున్నారు. కానీ రాజకీయాల్లో ఇలా ప్రత్యర్థులుగా మారడంతో మొదట్లో ఆప్ కాస్త వెనుకబడ్డా తర్వాత నిలదొక్కుకుంది. ఇక ఆప్ , బీజేపీ విమర్శలు తారా స్థాయికి చేరాయి.

నిన్నటి దాకా ఎన్నికల హడావిడిలో ఉన్న నేతలు ఇప్పుడు కాస్త సేద తీరుతున్నారు. ఢిల్లీ ప్రజలు ఎవరికి ఓటెత్తుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటింగ్ సరళికి ఈ సారి భిన్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2013 ఎన్నికల్లో 78.1 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని రికార్డు స్థాయిలో 65.86శాతం ఓటింగ్ నమోదు చేశారు. 65.78 శాతం పురుషులు, 65.17 శాతం మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఢిల్లీ ఎన్నికలల్లో ఓటు హక్కుల కలిగిన పురుషుల జనాభా 73.89 లక్షలు, మహిళల జనాభా 59.19 లక్షలు.

ఢిల్లీ ప్రజలు 14 నెలల్లో మూడో సారి ఓటువెయ్యాల్సి వస్తోంది కనుక ఈ సారి ఓటింగ్ శాతం తగ్గుతుందని కొందరి విశ్లేషణ. కానీ ఢిల్లీలో మారిన రాజకీయాలు, ఎన్నికల వేడి ఓటర్లను పోలింగ్ బూతుల వైపు నడిపిస్తుందని మరి కొందరి వాదన. ఎన్నికల ఫలితాలపైనా ఎవరి విశ్లేషణ వారిది. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో బీజేపీకి పట్టం కడతారని సర్వేలు పేర్కొంటే, ప్రచారం జరుగుతున్నపుడు మాత్రం ఆప్ కు పట్టం కడతారని కొన్ని సర్వేలు తేల్చాయి. మొత్తానికి సర్వేలు ప్రజలు ఏ పార్టీకి అవకాశాన్ని కల్పిస్తారని గట్టిగా చెప్పలేకపోతున్నాయి.

మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి గత ఎన్నికల్లో బీజేపీ, అకాళిదళ్ కు కలిపి 32 సీట్లు, ఆప్ కు 28 సీట్లు, కాంగ్రెస్ కు 8 సీట్లు వచ్చాయి. బీజేపీ ఢిల్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదు. ఓట్ల శాతం పరంగా బీజేపీకి 33.07%, ఆప్ కు 29.49% , కాంగ్రెస్ కు 24.55% , అకాళీదళ్ కు ఒక శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఈ ఎన్నికల్లో ఇదే కొనసాగింపు ఉంటుందని ఊహించలేం. గతంలో ఓటింగ్ ప్రారంభం నుండే ఓటర్ల తాకిడి భారీ ఉంది. సాయంత్రం 5 దాటినా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి ఫలితాలు కట్టబడతాయని చెప్పలేని  పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్ని సర్వేల్లోనూ వెల్లడైన అంశం. ఈ సారి కూడా ఎన్నికల ఫలితాలు ఎవరి అంచనాలకు అందవు అనేది నిజం. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు వెలువడే దాకా ఈ టెన్షన్ తప్పదు మరి.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi polling  delhi voter  aap in delhi  delhi govt.  bjp vs aap  delhi elections 2015  

Other Articles