Indian politics region caste delhi elections amithasha kiran bedi

caste politics, region politics, amith sha, delhi elections 2015, kiran bedi, gujjar, jots, sikhs voters

indian politics region caste delhi elections amithasha kiran bedi : in india politics have priority for caste and trgion. in the delhi elections amith sha follow the caste and region politics.

మతంలోనే మతలబు...కులంతోనే కలహాలు

Posted: 02/06/2015 06:15 PM IST
Indian politics region caste delhi elections amithasha kiran bedi

రాజకీయాల్లో కుల, మతాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ మన దేశంలో అయితే మరీ తీవ్రంగా కనబడుతుంది. రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో అనుకోకుండా, మతాన్ని కానీ కులాన్ని కానీ కించపరుస్తే ఇక ఆ పార్టీకి మూడినట్లే. గతంలో కేవలం వ్యక్తులను బట్టి ఓట్లు వేసిన జనం ఇప్పుడు మాత్రం, కులానికి, మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుల, మత రాజకీయాలు చోటుచేసుకున్నాయి. సిక్కు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను గంపగుత్తగా కొట్టేయ్యాలన్న ఆలోచనతో బిజెపి అధ్యక్షులు అమిత్ షా తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. కిరణ్ బేడిని ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిండం నుండి, సిక్కు ఊచకోత బాధితు కుటుంబాలకు కేంద్రం నష్ట పరిహారాన్ని చెల్లించడాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు అమిత్ షా.

ఇక ఢిల్లీ అర్బన్ ఏరియాలో కన్నా రూరల్ ఏరియాలో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటికి గాలం వేశారు. ఇలా అన్ని రకాలుగా ఆప్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను కుల, మతాల ఆధారంగా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో షా చాణిక్యం దాదాపుగా ఫలించింది.ఆప్ కు ఓటు వెయ్యాలని గుజ్జర్లు నిర్ణయించడంతో జాట్ ల ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేసింది బిజెపి. ఇలా ఢిల్లీ ఎన్నికల్లో కుల, మతాల ఆధారంగా రాజకీయాలు జరిగాయి. స్వతంత్ర భారతంలో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా కుల మతాల ఆదారంగానే ఎన్నికలు జరుగుతుండటం, మనం ఎంత వరకు లౌకిక వాదాన్ని పాటిస్తున్నామో చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : caste based politics  region politics  delhi elections  amith sha strategy  

Other Articles