Jammu kasmir pak india narendra modi

jammu kashmir war, pakistan vs india, pak loc, modi attack on pak

jammu kasmir pak india narendra modi : pak celebrates kashmir solidatary day. indian foreign affairs official respond on that. modi ready to attack on pakistan.

జమ్ము కాశ్మీర్ హమారా..హమారా

Posted: 02/06/2015 06:38 PM IST
Jammu kasmir pak india narendra modi

జమ్ము కాశ్మీర్...ఇది కేవలం భూభాగం మాత్రమే కాదు రెండు దేశాల పరువు ప్రతిష్ఠ. ఇంకా చెప్పాలంటే అంత కన్నా ఎక్కువే. అయితే భారత్ పై నిత్య కయ్యానికి కాలు దువ్వడానికి సిద్దంగా ఉండే పాక్ పై భారత్ అంతే కఠినంగా వ్యవహరిస్తోంది. కాశ్మీర్ సాలిడారిటీ డే పేరుతో పాక్ లోర్యాలీలు నిర్వహించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బహిరంగ సభలు నిర్వహించారు. గత కొంత కాలంగా నిత్యం భారత్ పైకి చొరబాటుదారులను పంపుతున్న పాక్ పై భారత్ కూడా మెతక వైఖరిని విడనాడిందని ఇక మీదట భారత్ ధీటుగా బదులివ్వడానికి సిద్దంగా ఉందని సంకేతాలు పంపింది. పాక్ లో జరిగిన ీ వేడుకలకు సంబందించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికర ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు.

పాక్ అరాచకాల గురించి ప్రపంచానికి తెలుసునని ఆయన అన్నారు. అయితే జమ్ము కాశ్మీర్ ఎప్పటికీ పాక్ లో భాగం కాదని, భవిష్యత్తులోనూ కాబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి తరహా దారుణాలకు పాల్పడితే ఈ సారి మాత్రం యుద్దానికి సిద్దంగా ఉందని అమెరికా మాజీ రాయబారి రాబర్ట్ మార్క్ విల్ తెలిపారు. మొత్తానికి పాక్ కుప్పిగంతులు ఇకపై చెల్లవని చాలా ఘాటుగా, స్పష్టంగా తెలిపింది భారత్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu war  kashmir battle  india on pak  

Other Articles