Hc notices to ap on araku mp

high court notices to araku mp, Hyderabad High Court, high court notices to Ap government, high court notices to vishka collector, petition on caste status of Araku MP Kothapalli Geeta. high court notices to Araku MP Kothapalli Geeta, araku mp kothapalli geetha, caste validation case

The Hyderabad High Court on Wednesday issued notices to the AP government and Visakhapatnam district collector on a petition challenging the caste status of Araku MP Kothapalli Geeta.

కొత్తపల్లికి కులం తెచ్చిన తంటా.. ప్రభుత్వానికి నోటీసులు

Posted: 02/05/2015 08:12 AM IST
Hc notices to ap on araku mp

అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు అమె కులమే పెద్ద తంటా తెచ్చిపెట్టింది. స్వైన్ ప్లూతో బాధపడిన కోలుకున్న ఆమెకు మరో షాక్ తగిలింది. రోగం బారి నుంచి తప్పించుకుని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుని.. అమె మద్దతుదారులు సంబరాల్లో మునిగిన మరుసటి రోజునే అమెకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమెతో పాటు మద్దతుదారుల ఆనందాలు అవిరపోయాయి. అమె కులం ధ్రువీకరణ అంశంలో హైకోర్టు స్పందించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ నోటీసులు జారీ చేసింది. కొత్తపల్లి గీతతోపాటు ఏపీ గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గీత ఎస్టీ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అరకు నుంచి ఎంపీగా గెలుపొందారని, ఈ కారణంగా ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈ.ఆంజనేయులు, మరొకరు గతేడాది నవంబర్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు.దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బుధవారం విచారించింది. పిటీషినర్ల తరుఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ చేసిన వాదనలు విన్న ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kothapalli Getha  High Court  caste validation  

Other Articles