The hindu mahasabha president warns lovers valentines day news

hindu maha sabha news, valentines day special, indian couples, indian lovers, lovers at parks, national hindu mahasabha latest news, chandraprakash kaushik news

the hindu mahasabha president warns lovers valentines day news : the hindu mahasabha president chandraprakash kaushik warns indian lovers to not celebrate valentines day.

‘వాలెంటైన్స్ డే’ రోజు ప్రేమికులు బయటకనిపిస్తే.. పెళ్లే!

Posted: 02/04/2015 03:46 PM IST
The hindu mahasabha president warns lovers valentines day news

‘వాలెంటైన్స్ డే’ (ఫిబ్రవరి 14) వచ్చిందంటే చాలు.. ప్రేమికులు ఆ రోజును ఎంతో అపురూపంగా భావిస్తారు. తాము తప్ప ప్రపంచంలో మరెవ్వరూ లేని ప్రపంచంలో మునిగిపోతారు.. జీవితంలో ఆ రోజును మధురానుభూతిగా మలుచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు, ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వారికి అదొక పండుగలాంటిదన్నమాట! అటువంటి రోజు సంవత్సరానికి కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి.. తమ ప్రేమను పంచుకునే ఆరోజు కోసం ప్రేమికులందరూ పడిగాపులు కాస్తుంటారు.

విదేశాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు కానీ.. భారత్’లో మాత్రం పరిస్థితులు భిన్నంగా వుంటాయి. ఎందుకంటే.. అది భారతీయ సంస్కృతికి విరుద్ధం కాబట్టి! హిందూ సంస్కృతీ-సంప్రదాయాలకు, ప్రాచీన ఆచార వ్యవహారాలకు భారతదేశం పెట్టింది పేరు! అటువంటి దేశంలో ఇటువంటి సిగ్గుమాలిన పండుగలు జరుపుకోవడం సమాజానికి, సంస్కృతికి అవమానకరమని భావించిన హిందూ సంస్థలు.. ఎప్పటి నుంచో ఈ వాలెంటైన్స్ డే నిర్వహణకు అభ్యంతరం చెబుతూనే వున్నాయి. అది విదేశీ పండుగ అని, మన సంస్కృతికి అది సరిపడదని సూత్రీకరిస్తున్నాయి. అంతేకాదు.. ఏ ప్రైమ జంటైనా వాలెంటైన్స్ డే రోజు బయట కనిపిస్తే.. బలవంతంగా పెళ్లిళ్లు చేసిన సందర్భాలూ వున్నాయి. ఇప్పుడు కూడా అలాగే చేస్తామంటూ హిందుత్వ సంస్థలు ప్రేమికులకు హెచ్చరిస్తున్నాయి.

ఫిబ్రవరి 14వ తేదీన రానున్న ఈ ప్రేమికుల రోజును జరుపుకోవద్దంటూ హిందుత్వ సంస్థలు ఇప్పటినుంచే హెచ్చరికలు చేస్తున్నాయి. అలాకాకుండా ఎవరైనా జంటలు కనిపిస్తే.. వారికి పెళ్లిళ్లు చేస్తామని చెబుతున్నాయి. హిందూ జంటలు కనిపిస్తే వారికి ఆర్యసమాజ్ తరహాలో పెళ్లి చేస్తామని.. వేర్వేరు మతాలకు చెందిన జంటలు కనిపిస్తే వారికి ‘శుద్ధికరణ’ నిర్వహించిన అనంతరం పెళ్లిళ్లు చేస్తామని హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాష్ కౌశిక్ తెలిపారు. ఈ సందర్భంలోనే మాట్లాడిన ఆయన.. సంవత్సరంలో 365 రోజులు ప్రేమగా గడపాలని భావించే దేశం భారత్ అని, అలాంటప్పుడు ప్రేమకులు కేవలం ఫిబ్రవరి 14వ తేదీనే ‘వాలెంటైన్స్ డే’గా ఎందుకు జరుపుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విదేశీ సంస్కృతిని భారత్ నుంచి బహిష్కరించాలంటూ పలు సంస్థలు పిలుపునిస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : valentines day news  hindu mahasabha news  

Other Articles