Mammootty mohanlal controversy sangeet band money problems malayalam industry

mammootty news, mammootty latest statement, mammootty controversy, mohanlal news, mohanlal controversy, mohanlal sangeet band, mohanlal leelasam band, mohanlal band controversy, mammootty mohanlal news, mammootty mohan supports, malayalam movie industry

Mammootty mohanlal controversy sangeet band money problems malayalam industry : Senior actor Mammootty has requested all to stop the witch-hunt against his colleague and noted actor Mohanlal over the controversy that erupted following the poor response to his ‘Lalisom’ musical show at the inauguration of the 35th National Games.

వివాదాల్లో వున్న అగ్రహీరోకు అండగా నిలిచిన మరో హీరో!

Posted: 02/04/2015 03:43 PM IST
Mammootty mohanlal controversy sangeet band money problems malayalam industry

మలయాళం సూపర్ స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి ఇద్దరూ వృత్తిపరంగా పోటీపడుతుంటారు. ‘నేనంటే నేను నెంబర్ వన్’ అంటూ వరుసగా తమ చిత్రాలను విడుదల చేస్తుంటారు. అయితే.. వ్యక్తిగతంగా మాత్రం వారిద్దరూ మంచి స్నేహితులని తాజాగా జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కష్టాల్లో వున్న మోహన్ లాల్’కు మమ్ముట్టి అండగా వుంటూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

వివరాల్లోకి వెళ్తే.. మోహన్ లాల్ ఆధ్వర్యంలో ‘లాలీసమ్’ అనే బ్యాండ్ నడుస్తున్న విషయం తెలిసిందే! తిరువనంతపురంలో ఇటీవలే ప్రారంభమైన 35వ జాతీయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ బ్యాండ్ ఓ సంగీత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. అయితే.. ఈ కార్యక్రమం అంతా ఉత్సాహంగా లేదని, అందరినీ నిరాశపరిచిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మోహన్ లాల్’కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన మోహన్ లాల్.. ఆ సంగీత కార్యక్రమం కోసం తాను తీసుకున్న డబ్బును తిరిగిచ్చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ అగ్రహీరోకు మమ్ముట్టి మద్దతు ప్రకటిస్తూ.. మోహన్ లాల్’కు అండగా నిలబడాలంటూ సహచర నటులకు పిలుపునిచ్చారు.

‘‘ఒక కార్యక్రమం నిర్వహించడానికి కళాకారులు ఎంతో కష్టపడతారు. ఎన్ని సమస్యలు ఎదురొచ్చిన వాటిన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రేక్షకుల కోసం ఆ కార్యక్రమ పనులను పూర్తి చేస్తారు. అలాగే మోహన్ లాల్ కూడా ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన స్ఫూర్తిని అందరూ అభినందించాల్సిందిపోయి.. ఇలా విమర్శించడం సమంజసం కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ఆయన కార్యక్రమం నిర్వహించడం మనకు నిజంగా గర్వకారణం’’ అని విలేకరుల సమావేశంలో మమ్ముట్టి అన్నారు. ఆయనకు అండగా నిలబడాలని తోటి నటులకు పిలుపునిచ్చారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mammootty latest news  mohanlal band controversy  telugu news  

Other Articles