Transport department new twist in vehicle registration

transport department new twist, new twist in vehicle registration, transport authorities issues new orders, transport authorities issues unofficial orders, RTA orders to purchase high security number plates, high security number plates, no new registrations in telangana, high security number plate prices

telangana state transport department gives twist, unofficially orders to purchase high security number plate before registration of new vehicles

వాహనాల రిజిస్ట్రేషన్లకు రవాణాశాఖ మెలిక..

Posted: 02/01/2015 06:47 PM IST
Transport department new twist in vehicle registration

నూతన వాహనాల రిజిస్ట్రేషన్లకు రవాణా శాఖ అధికారులు కొత్త మెలిక పెట్టారు. మీ కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇక మీదట హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఖచ్చితంగా కోనుగోలు చేయాల్సిందే. లేని పక్షంలో మీ వాహనాల రిజిస్ట్రేషన్ వాయిదా పడుతుంది. అంటే హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) ప్రాజెక్టును అధికారులు అనధికారికంగా నిర్బంధం చేశారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు వెలువరించకుండానే అధికారులు దాని నిర్బంధ అమలును ప్రారంభించారు. ఇక నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌పీ రుసుం చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే తొలుత హెచ్‌ఎస్‌ఆర్‌పీ ధరను ఆ సంస్థ కౌంటర్‌లో చెల్లించాలి. దాని చెల్లింపు పూర్తయిందని ఆన్‌లైన్‌లో పరిశీలించి అధికారులు నిర్ధారించుకున్న తర్వాతే వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఈ నిర్ణయం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు.  హెచ్‌ఎస్‌ఆర్‌పీ విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించకుండానే అధికారులు దాన్ని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకి స్తున్నారు. ఢిల్లీలాంటి చోట్ల తక్కువ ధరకే ఈ ప్లేట్లను సరఫరా చేస్తుండగా, తెలంగాణలో ఎక్కువ ధర ఖరారు చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.  

  • ద్విచక్ర వాహనాలు:    రూ.245
  • ఆటోరిక్షాలు:    రూ.252
  • కార్లు, తేలిక వాహనాలు:    రూ.619
  • భారీ వాహనాలు:    రూ.649

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : transport department  new twist  vehicle registration  high security number plates  

Other Articles