As obama leaves to saudi modi bids farewell

narendra modi Tweet, narendra modi send off, narendra modi send off to obama, white house tweet, white house responce, narendra modi, obama modi visit 2015, obama india visit, michelle obama, narendra modi speech, narendra modi biography, narendra modi facebook, narendra modi twitter, narendra modi latest news, narendra modi blog, narendra modi latest updates, narendra modi social media, narendra modi obama meet,

As US President Barack Obama left India, Prime Minister Narendra Modi on Tuesday said his visit has taken the bilateral relations to a new level and opened a new chapter.

ట్విట్టర్ ద్వారా ఒబామా దంపతులకు మోడీ వీడ్కోలు

Posted: 01/27/2015 08:18 PM IST
As obama leaves to saudi modi bids farewell

అగ్రరాజ్య అధినేత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన దిగ్విజయంగా ముగిసింది. భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరైన ఒబామా దంపతులు.. డిసెంబర్ 25న భారత్ కు చేరుకున్నారు. భారత్ పర్యటనలో భాగంగా పలు అత్యంత కీలకమైన పౌర అణు ఒప్పందంలో వున్న పలు అడ్డంకులను తొలగించి.. ఇరు దేశాల మధ్య దైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను మొరుగుపర్చుకున్నారు. ఒబామా దంపతులకు ప్రధాని మోడీ స్వయంగా పాలెం విమానానికి వెళ్లి స్వాగతం పలికారు. అలాగే ఆయన ఒబమా దంపతులు వెళ్లిన తరువాత కూడా ప్రధాని మోడీ వారి ట్వట్టర్ ద్వారా వీడ్కోలు పలికారు. మూడు రోజుల భారత పర్యటన ముగించుకుని  ఒబామా దంపతులు ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు పయనమయ్యారు. సౌదీ రాజు అబ్దుల్లా మరణించడంతో ఒబామా ఆగ్రా పర్యటనకు రద్దు చేసుకుని సౌదీకి బయల్దేరారు.

ఒబామా పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఇదే మీకు వీడ్కోలు. మీ పర్యటన భారత్, అమెరికా సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లెంది. మీ ప్రయాణం క్షేమంగా సాగాలని కోరుకుంటున్నాను’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా వైట్‌హౌస్ కూడా ఇదే రీతిలో స్పందించింది. ఒబామా భారత్ పర్యటన ఓ మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందని, తమకందించిన స్వాగత, సత్కారాలకు భారతీయులకు, మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. దీనిపై మోదీ స్పందిస్తూ మళ్లీ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ పరేడ్ సందర్భంగా వర్షం పడుతుంటే ఒబామా స్వయంగా తానే గొడుకు పట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ ‘బడే బడే దేశంమే ఐసీ చోటే చోటే బాతే హోతీ రహతే హై’ అంటూ సందర్భోచితంగా ఒబామా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  narendra modi  twitter  

Other Articles