Facebook and instagram were down and restored

Facebook and instagram crash, social media sites, Facebook, instagram, sudden crash, photos sharing sites, image sharing platform sites, Notorious hacker group, Tinder, AIM, Hipchat, facebook hacked, instagram hacked, social websites hacked, social media sites hacked, facebook restored, instagram restored,

Facebook and Instagram services were restored on Tuesday after a brief outage that lasted around one hour

పునరుద్దరించబడిన ఫేస్ బుక్ ఇస్టాగ్రామ్.. తమ పనేనంటున్న హ్యాకర్లు

Posted: 01/27/2015 12:16 PM IST
Facebook and instagram were down and restored

సామాజిక వైబ్ సైట్ల అనుసంధానంగా పలు కార్యక్రమాలను నిర్వహించే వారికి చేదువార్త. ఇవాళ ఉదయం నుంచి సామాజిక వెబ్ సైట్ దిగ్గజమైన ఫేస్ బుక్ పనిచేయడంలో లేదు. ఫేస్ బుక్ అనుసంధానంతో పనిచేసే మరో సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ కూడా పనిచేయడం లేదు. ఫేస్ బుక్, ఇస్టా గ్రామ్ వ్యవస్థలు తాత్కాలికంగా కుప్పకూలాయి. ఇవాళ ఉదయం నుంచి భారత్ లో ఈ సామాజిక వైబ్ సైట్లు పనిచేయడం లేదు. కాగా పలు దేశాల్లలో నిన్న రాత్రి నుంచి ఇదే పరిస్థితి వున్నట్లు సమాచారరం.

కంగారు పడి వెబ్ సైట్ కు వెళ్లి పేజీని తెరుద్దామనుకునే వారికి అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే.. ఫేస్ బుక్ లో మీ పేజీని తెరవగానే ఫేస్ బుక్ మీకు ఓ సందేశంతో స్వాగతం పలుకుతుంది. ఎక్కడో చిన్న తప్పు జరిగిందని, దానిని సవరించడానికి తాము యత్నాలు ముమ్మరం చేశామని, సవరణలు పూర్తి కాగానే సాధ్యమైనంత త్వరలో మీ ముందుకు వస్తామని సందేశం పలుకరిస్తుంది. ఇలా కాని పక్షంలో సాధారణంగా కనబడే ‘సర్వర్ కనిపించడం లేదు’ ( కన్ నాట్ ఫైండ్ సర్వర్ ) అంటూ కనబడుతోంది. ఈ పరిస్థితిపై తెలుసుకునేందుకు ఫేస్ బుక్ ట్విట్టర్ అకౌంట్ ను పరిశీలించగా, అందులో ఎలాంటి తాజా సమాచారం పొందుపర్చలేదు.

అయితే కరుడుగట్టిన వైబ్ సైట్ హ్యకర్ గ్రూప్ మాత్రం ఇది తమ పనేనంటూ ట్విట్టర్ లో ట్విట్ చేశాయి. కేవలం ఫేస్ బుక్ మాత్రమే కాదు, ఇస్టాగ్రామ్, టిండర్, ఏఐఎం, హిప్ చాట్ తదితర సామాజిక వెబ్ సైట్లను హాక్ చేసినట్లు పేర్కొంది. కాగా రంగంలోకి దిగిన ఫేస్ బుక్ యాజమాన్యం సర్వీసులను పునరుద్దరించింది. సుమారు గంట పాటు క్రాష్ అయిన సైట్లను సదరు సంస్థ నిఫుణులు మళ్లీ ప్రపంచ వ్యాప్త ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చారు. దీంతో నెట్ జనులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పడు యాజమాన్యం ఆరా తీస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  instagram  restore  hacked  

Other Articles