Bomb blast at ara civil court in bihar 3 dead four injured

bihar crime news, patna crime news, bomb blasts india, bihar bomb blast news, patna bomb blast news, bihar police investigations, bihar districts news, bihar districts bomb blast news, bihar civil court

A bomb blast took place inside the premises of a civil court in Bihar's Ara district on Friday.

బీహార్ సివిల్ కోర్టులో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

Posted: 01/23/2015 12:52 PM IST
Bomb blast at ara civil court in bihar 3 dead four injured

బిహార్ మరోమారు రక్తమోడింది. ఉగ్రవాదులు అన్నంత పని చేశారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నధమవుతున్న తరుణంలో బాంబులతో తెగబడ్డారు. గణతంత్ర దినోత్సవాలకు సిద్దమవతున్న తరుణంలో తీవ్రవాదలు తొలిటార్గెట్ గాబీహార్ ను ఎంచుకున్నారు. బీహార్ పట్టణంలోని అరా సివిల్ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మగ్గురు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. శక్తివంతమైన బాంబు విస్పోటనం జరగడంతో ఓ కానిస్టేబుల్ సహా  ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన అస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఓ మహిళ తన పర్సులో బాంబును కోర్టు అవరణలోకి తీసుకువచ్చిందని తెలిపారు. శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించడంతో ఆ మహిళ అక్కడికక్కడే మరణించిందని తెలిపారు. ఆరా సివిల్ కోర్టు ఆవరణలోబాంబు పేలిందన్న వార్త దవానంలో పట్టణ ప్రజలకు చేరడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పేలుడు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patna  Bihar  Ara civil court  Bomb blast  Bihar Police  

Other Articles