Snowfall in jammu and kashmir disrupts normal life

snowfall in Jammu and Kashmir, snowfall disrupts normal life, snowfall in jammu and kashmir 2015, heavy snowfall in jammu and kashmir, jammu and kashmir gandhi nagar, snowfall in srinagar, snowfall in qazigund, srinagar-jammu national highway closed, kashmir valley, snowfall, Srinagar Jammu Highway

Police officials walk on a snow-covered road at Qazigund as Srinagar- Jammu National Highway was closed to heavy snowfall on Thursday.

జమ్మూలో భారీగా కురుస్తున్న హిమపాతం.. స్థంబించిన జనజీవనం..

Posted: 01/22/2015 09:24 PM IST
Snowfall in jammu and kashmir disrupts normal life

జమ్మూ కాశ్మీర్‌లో భారీగా హిమపాతం కురుస్తోంది. సాధారణం కన్నా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనజీవనం స్థంభించింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా అధికారులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జవహార్ టన్నల్‌ను మూసివేయడంతో సుమారు 423 కిలోమీటర్ల మేర పలు చోట్ల వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జమ్మూ వ్యాలినీ ఇతర ప్రాంతాలకు కలిపే ఏకైన రోడ్డు మార్గం ఇదే కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

కాశ్మీర్ వ్యాలీతో పాటు గుల్ మార్గ్‌లో కూడా మంచు భారీగా కురుస్తోంది. రాత్రి వేళల్లో 1.5 అడుగుల మేర మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాశ్మీర్‌లోని క్వాజికుంద్‌లో భారీగా హిమపాతం కురుస్తుండటంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉష్టోగ్రత అత్యంత కనిష్ట స్దాయిలో నమోదైంది. ఇక ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంత జిల్లాల్లో కూడా మంచు కురుస్తోంది. చల్లని గాలుల వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరకాశి, రుద్రప్రయాగ, తదితర జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. బద్రినాధ్, కేదార్‌నాధ్, హేమకుండ్ సాహిబ్, వ్యాలీ ఆప్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి భారీగా మంచు కురుస్తూనే ఉందని అధికారులు తెలిపారు. సిమ్లాకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్ఫీ ప్రాంతంలోని మంచుతో కప్పబడిన రోడ్లపై నడుస్తున్న ప్రజలు. ఆ ప్రక్కనే రోడ్డుపై వెళుతున్న వాహనాలు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kashmir valley  snowfall  Jammu Kashmir  jammu-srinagar highway  

Other Articles