Supreme court verdict on ipl spot fixing game changer verdict says bcci

indian supreme court verdict on ipl, supreme court verdict on ipl, gurunath meiyappan in ipl scam, raj kundra in ipl scam, supreme court gives srinivasan clean chit, supreme IPL spot-fixing verdict, chennai super kings, rajasthan royals, gurunath meiyappan, raj kundra, ipl, srinviasan, supreme court, new delhi, cricket, shilpa shetty, ipl spot fixing dhoni, ipl spot fixing 2014, ipl spot fixing committee, ipl spot fixing case latest news, ipl spot fixing head, bcci, game changer verdict says bcci,

The Supreme Court of India has barred N. Srinivasan from contesting the BCCI elections, until he decides his conflict of intrest

ఐఫీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో శ్రీనివాసన్ క్లీన్ చిట్ ఇవ్వని సుప్రీం

Posted: 01/22/2015 03:58 PM IST
Supreme court verdict on ipl spot fixing game changer verdict says bcci

ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఫిక్సింగ్‌కు శ్రీనివాసన్ పాల్పడినట్లు రుజువుల్లేవని పేర్కన్న న్యాయస్థానం.. అతనికి క్లీన్ చిట్ ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. ఐఫీఎల్ ఫ్రాంచైజీ, లేదా బీసీసీఐ బోర్డు పదవిలో ఏదో ఒక దానిని మాత్రమే శ్రీనివాసన్ ఎన్నుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఇందుకు బిసిసిఐ నిబంధనల్లో వున్న 6.2.4 నిబంధనను కొట్టివేసింది. ఇది తేల్చుకునేవరకు ఆయన ఎన్నికలలో పోటీ చేయరాదని సుప్రీం ఆదేశించింది. ఆరు వారాల్లో బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. బీసీసీఐ సభ్యలు, అధికారులు ఎవ్వరూ ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొనరాదని హెచ్చరించింది. బీసిసిఐతో పాటు ఐపీఎల్ లోని నిభంధనల్లో అత్యున్నత న్యాయస్థానం పలు సవరణలు చేసింది.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్, రాజ్ కుంద్రాలను సుప్రీంకోర్టు దోషులుగా నిర్ధారించింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడైన గురునాథ్ మెయప్పన్‌కు బెట్టింగ్‌తో సంబంధం ఉందని సర్వోన్నత న్యాయస్థానం నిర్థారించింది. గురునాథ్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు యజమానని, రాజ్‌కుంద్రా రాజస్థాన్ రాయల్స్‌కు సహ యజమానని తేల్చింది. వీరిద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను కమిటీ రుజువుచేసిందని న్యాయస్థానం తెలిపింది. శ్రీనివాసన్‌పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని, నిబంధనల మేరకే ముద్గల్ కమిటీ నివేదిక ఇచ్చిందని న్యాయస్థానం పేర్కొంది.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన గురునాథ్ మెయప్పన్, రాజ్ కుంద్రా భవిష్యత్తును నిర్ధారించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా సహా న్యాయమూర్తులు అశోక్ బాన్, ఆర్వీ రవీంద్రన్లతో కూడిన కమిటీని నియమించింది. జూన్ 2013 నాటి ఈ కేసులో దాదాపు 18 నెలల తర్వాత తీర్పు వెలువడింది. సర్వోన్నత న్యాయస్థానం 130 పేజీల తీర్పును వెలువరించింది. కాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బిసిసిఐ స్పందించింది. సుప్రీం తీర్పు ఆటను మార్చేదిగా వుందంటూ హర్షం వ్యక్తం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gurunath meiyappan  raj kundra  ipl  srinviasan  supreme court  cricket  

Other Articles