Sit questions list for shashi tharoor

Sunanda Pushkar Death case, Shashi tharoor questioned, police questions Shashi Tharoor, Shashi Tharoor latest, police questions list to Shashi Tharoor, Sunanda Pushkar murder case, Sunanda Pushkar death mystery, Sunanda Pushkar murder case status, Sunanda Pushkar death case latest updates

SIT Questions list for Shashi Tharoor : Special Investigation Team questioned Shashi Tharoor on monday night with list of questions. Tharoor questioned for four hours by police in sunanda murder case

థరూర్ ను పోలిసులు అడిగిన ప్రశ్నలివే

Posted: 01/20/2015 08:07 AM IST
Sit questions list for shashi tharoor

సునంద పుష్కర్ హత్య కేసును ధర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం సోమవారం రాత్రి శశి థరూర్ ను ప్రశ్నించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ భవన్ లో సుమారు 4గంటల పాటు విచారణ జరిగింది. విచారణకు ముందే లాయర్లను కలిసిన శశి సుదీర్ఘంగా చర్చించారు. పోలిసులు అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పాల్సిన విధానం ఇతర అంశాలపై సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు. పోలిసుల ప్రశ్నలకు చాలా కామ్ గా.., చిన్న చిన్న మాటలతో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని ప్రశ్నలకు సాధారణంగా సమాధానం చెప్పిన థరూర్.., జనవరి 17వ తేదీ 2014లో సునందను గదిలో చూసిన సమయంలో ఎలా అన్పించింది అనగానే.., ఉద్వేగానికి లోనై సమాధానం చెప్పినట్లు పోలిసు వర్గాలు తెలిపాయి. నాలుగు గంటల విచారణలో థరూర్ కు సంధించిన ప్రశ్నల్లో కొన్ని బయటకు వచ్చాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రశ్న : సునందకు వైద్యులు సూచించకపోయినా ఆమె గదిలో ఆల్ప్రాక్స్ మాత్రలు ఎందుకు ఉన్నాయి?
ప్రశ్న : సునంద శరీరంపై 15 చోట్ల గాయాలు ఉన్నాయి ఎందుకు? మీరు (థరూర్) ఆమెపై దాడి చేశారా?
ప్రశ్న : సునంద అపస్మారక స్థితిలో ఉన్నపుడు వెంటనే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్ళలేదు? పోలిసులను వెంటనే ఎందుకు పిలవలేదు?
ప్రశ్న : సునందకు చర్మ సంబంధ వ్యాధి లేకపోయినా.. ఉందని మీరు ఎందుకు చెప్పారు?
ప్రశ్న : పాకిస్తాని జర్నలిస్టు మెమర్ తరార్ మీకు ఎలా తెలుసు..? ఆమెతో మీరు ఢిల్లీలో ఉన్నారా?
ప్రశ్న : సునందది సాధారణ మరణంగా చూపాలని ఎయిమ్స్ డైరెక్ట ర్ కు మెయిల్స్ ఎందుకు వెళ్ళాయి?

ఇలా సునంద మృతికి సంబంధించి అనుమానాలు ఉన్న అనేక ప్రశ్నలను థరూర్ కు స్పందించారు. దీనికి ఆయన నామమాత్రంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. సునందను కొట్టారా అని ప్రశ్నిస్తే.., ‘చనిపోవటానికి ముందు నేను ఏమి కొట్టలేదు. గతంలో మాత్రం మా ఇద్దరికి గొడవలు ఉన్న మాట వాస్తవం’ అని అంగీకరించారు. సరైన సమాధానాలు చెప్పకపోవటంతో ఢిల్లీ పోలసులు మరోసారి థరూర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunanda Pushkar murder  Shashi Tharoor  Delhi police  

Other Articles