Kiran bedi vs arvind kejriwal in delhi elections

Kiran Bedi, Delhi bjp cm candidates, Kiran Bedi bjp, Kiran Bedi delhi cm candidate, Kiran Bedi vs Arvind Kejriwal, Kiran Bedi on Kejriwal, Delhi Elections 2015, delhi elections bjp candidates, delhi elections congress candidates

BJP Announced Kiran Bedi as CM candidate : BJP Chief Amit Shah announced Kiran Bedi as delhi cm candidate, Bedi will contest from Krishna Nagar constituency in Arvind Kejriwal

పంతం నీదా.. నాదా.. సై !

Posted: 01/20/2015 07:32 AM IST
Kiran bedi vs arvind kejriwal in delhi elections

హస్తిన ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇద్దరు పాత మిత్రుల మద్య పోటీకి ఈ ఎన్నికలు వేదిక అవుతున్నాయి. సిద్ధాంతాలు వేరని విడిపోయిన ఇద్దరు నేతల మద్య నువ్వా.. నేనా అన్నట్లు పోటిని పెట్టాయి. అందరూ ఊహించినట్లుగానే బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడిని నాయకత్వం ప్రకటించింది. సోమవారం రాత్రి అమిత్ షా ఈ నిర్ణయం వెల్లడించారు. సుదీర్ఘ చర్చల తర్వాత 65ఏళ్ళ బేడి అయితేనే సీఎం అభ్యర్ధిగా సమర్ధురాలు అని నిర్ణయించుకుని ప్రకటన చేశారు.

ఢిల్లీలోని కృష్ణా నగర్ నియోజకవర్గం నుంచి బేడి బరిలోకి దిగనుంది. ఇక్కడి నుంచే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ కూడా పోటి చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. హస్తిన పోరులో ఆప్-బీజేపి మద్యే ప్రధాన పోటి ఉంటుందని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో బీజేపి అరవింద్ కు గట్టి పోటిని ఇచ్చేలా మాజీ ఐపీఎస్ ను రంగంలోకి దించటంలో విజయం సాధించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో కేజ్రివాల్ తో పాటు కిరణ్ బేడి కూడా బాగా పేరు పొందారు. ఇద్దరూ ఒకప్పుడు అన్నా అడుగుజాడల్లో కలిసి పనిచేసిన నేతలే. అయితే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి అవినీతి నిర్మూలించాలని కేజ్రివాల్ భావించి ఆప్ పార్టీ పెట్టగా.. బేడి మాత్రం హజారే వెంట ఉన్నారు. కానీ చివరకు ఆమె కూడా అనుకోని పరిస్థితుల్లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran Bedi  Arvind Kejriwal  Delhi Elections  

Other Articles