High court questions telangana government on fast scheme

FAST Scheme, FAST Scheme updates, Telangana government, FAST Scheme, Telangana government scholarships, Telangana epass, KCR on Fast scheme, High court on Fast Scheme, Telangana Updates

High Court questions telangana government on Fast scheme : Hyderabad High court asked Telangana government about government order on FAST Scheme. HC serious on negligence of Telangana state for submitting objection or counter affidavit on Fast scheme

ఫా(సి)స్ట్ జీ.ఓ. నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం

Posted: 01/19/2015 02:51 PM IST
High court questions telangana government on fast scheme

తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద ఫాస్ట్ జీవో (Financial Assistance for Students of Telangana)పై వివరణ ఇవ్వటంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. జీఓపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలని ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని మొట్టికాయలు వేసింది. కోర్టుతో ప్రభుత్వాలు ఇలాగే ప్రవర్తిసాయా అని గట్టిగా మందలించింది.

‘ఫాస్ట్’పై ఇవాళ జరిగిన విచారణ సందర్బంగా జీవోలో 1-11-1956 అనే తేదిని ఎందుకు పేర్కొన్నారో చెప్పాలని హైకోర్టు కోరింది. వివరణ ఇచ్చేందుకు సమయం పడుతుందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పటంతో కోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వానికి ఇప్పటికే మూడు సార్లు గడువు ఇచ్చాము. మరో సారి పద్నాలుగు రోజుల సమయం ఇస్తున్నాం. ఈ సారి తప్పకుండా కౌంటర్ దాఖలు చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ప్రభుత్వాలు చేసే జీవోలన్నీ రాజ్యాంగానికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది.

ఏమిటీ ఫాస్ట్ :

రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణలో ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ ‘ఫాస్ట్’ (Financial Assistance for Students of Telangana) అని పేరు పెట్టింది. అయితే కేవలం స్థానిక విద్యార్థులకే స్కాలర్ షిప్పులు దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వివాదాస్పద నిబంధన తీసుకువచ్చింది. 01-11-1956కు ముందు తెలంగాణలో ఉన్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ఫాస్ట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీఓ పట్ల ఏపీ ప్రభుత్వం, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ సర్కారు మాత్రం వెనక్కి తగ్గకపోవటంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. జీఓ వివాదాస్పదం కావటంతో తెలంగాణ విద్యార్థులకు ఇప్పటివరకు స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకునే అవకాశం రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : FAST Scheme  Telangana Government  Hyderabad High Court  

Other Articles